రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్.. సెల్ఫీ వీడియోతో సంచలనం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకోవడం.. అది బయటకు రావడం.. దానిలోని తమ ఫ్యామిలీ ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.. వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని.. రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి.. అతని లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు.. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని.. కానీ, ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు.. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగాడు.. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు నా భార్యాపిల్లల్ని తీసుకెళ్తున్నాను అంటూ వీడియోలో అన్ని చెప్పుకొచ్చారు రామకృష్ణ.

Read Also: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

నా భార్యను పంపిస్తే ఆస్తి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు… నా భార్య నాకోసం వచ్చింది.. ఆమెకు ఎన్నో హామీలు ఇచ్చి వచ్చాను.. నేను ఒక్కడిని ఆత్మహత్య చేసుకుంటే.. నా భార్యను ఏమైనా చేస్తారు. నా పిల్లలు అన్యాయం అవుతారు. నా భార్యకు ఈ విషయం తెలియదు. నేను చేసేది తప్పు అని తెలిసినా ఇంకా ఎవ్వరికీ అన్యాయం జరగొద్దని ఈ నిర్ణయం తీసుకుంటున్నానని వీడియోలో చెప్పారు రామకృష్ణ.. ఎంత మందితో చెప్పుకున్నా నీ సమస్య పరిష్కారం కాదు.. నీ ఆస్తి నయా పైసా కూడా రాదు.. రాజకీయ బలుపు, ఆర్ధిక బలుపుతో అవతల మనిషి బలహీనతలను గ్రహించి ఇలా తన పబ్బం గడుపుకుంటున్నాడని మండిపడ్డాడు.. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలి.. వనమా రాఘవ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి.. నేను ఏంటో ఆ వీధీలో అందరికీ తెలుసు.. నేను అభియోగం చేస్తున్నానని అనుకోవచ్చు.. ఇలాంటి రికార్డింగ్ లు ఉండవు, ఫొటోలు ఉండవు. ఇవన్ని చీకటి కోణాలు.. ఏదైనా చేయాలన్నా, ఎవరి సహాయం తీసుకోవాలన్నా.. నాకేంటి వనమా రాఘవ ఎక్కువ ఆలోచిస్తాడని ఆవేదన వ్యక్తం చేశారు.. 12 సంవత్సరాల మా సంసార జీవితంలో ఏ రోజు ఏ పొరపొచ్చాలు లేకుండా చేసుకున్నాను.. అన్ని రకాల హామీలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. ఏ రకంగా నేను పంపించగలను.. కాబట్టి నిర్ణయం తీసుకుంటున్నాను. దయ చేసి నా ఈనిర్ణయాన్ని తప్పు పట్టకండి.. నా జీవితం కూడ ఎలా అయినా పరువాలేదు.. నా ఆర్ధిక సహాయం చేసిన వారిని నష్టం జరుగకుండా నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిని నాకు సహకరించిన వారందరికి అప్పు తీర్చాలని కోరాడు.. కానీ, ఇలాంటి దుర్మార్గులను మాత్రం ఎదగనివ్వకండి. ఈ మధ్య కాలంలో ఒక్కరు రాఘవ పేరు పెట్టి చనిపోయాడు. నెల రోజులు రాఘవ దాక్కొని బెయిల్ తెచ్చుకుని వచ్చాడు. ఎక్కడో దాక్కోని వచ్చాడు.. ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ ప్రారంభించాడు.. ఇలాంటి వ్యక్తి వల్ల లోకంలో ఎవరు బతుకుతారు.. సామాన్యులు ఎలా బతుకుతారు? తట్టుకుని ఎలా నిలబడగలరు.. ? అని గోడు వెల్లవేసుకున్న రామకృష్ణ.. ఇప్పుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది.

Related Articles

Latest Articles