Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Nara Lokesh Letter To Cm Jagan On Aqua Farmers Problems

Lokesh: సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించండి.. జగన్‌కు లోకేష్ లేఖ

Published Date :June 16, 2022 , 11:54 am
By Mahesh Jakki
Lokesh: సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించండి.. జగన్‌కు లోకేష్ లేఖ
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు. ఇసుక పాల‌సీ మార్చి భ‌వ‌న‌ నిర్మాణ‌ రంగాన్ని దానికి అనుబంధంగా ఉన్న 130కి పైగా వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేశారని ఆయన మండిపడ్డారు. వంద‌లాది మంది భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కార‌కుల‌య్యారని ఆరోపించారు. అనాలోచిత విధానాల‌తో విద్యుత్ కోత‌లు ఆరంభించి పరిశ్రమలకు ప‌వ‌ర్‌ హాలీడే ప్రక‌టించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు పంట‌లు వేయ‌కుండా క్రాప్‌ హాలీడే పాటిస్తున్నారని తెలిపారు.

ఇప్పుడు ఆక్వా రంగం కూడా సంక్షోభంలో ప‌డిందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఫీడ్ ధ‌ర అధికం కావ‌డం, రొయ్యల ధ‌ర త‌గ్గిపోవ‌డంతో త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్రక‌టించాల‌ని రైతులు తీసుకున్న నిర్ణయంపై సర్కారు ఇప్పటివ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌డం విచార‌క‌రమని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. ఆక్వారంగానికి మేలు చేస్తాన‌ని హామీలు ఇచ్చిన మీరు అధికారంలోకి వ‌చ్చాక… ఫీడ్-సీడ్ యాక్ట్‌లతో రైతులు తీవ్రంగా న‌ష్టపోతున్నారన్నారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి స‌బ్సిడీలు ఎత్తివేయ‌డం ముమ్మాటికీ ఆక్వారైతుల‌కు ద్రోహం చేయ‌డ‌మే అని అన్నారు.

YSRTP : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారా ..? |

టీడీపీ ఇన్నిర‌కాలుగా ఆక్వారంగానికి ప్రోత్సాహం అందిస్తే, మీరు స‌బ్సిడీలు ఎత్తేసి సంక్షోభానికి కార‌కుల‌య్యారని లోకేష్‌ మండిపడ్డారు. ఆక్వారంగం ప‌ట్ల వైసీపీ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖ‌రి కార‌ణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా క‌ళ్లుతెరిచి ఆక్వా రైతుల డిమాండ్లన్నీ త‌క్షణ‌మే నెర‌వేర్చకపోతే ప‌రిశ్రమ‌లు, వ్యవసాయ‌రంగం దారిలోనే ఆక్వా హాలీడే కూడా త‌ప్పక‌పోవ‌చ్చన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖలో పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aqua farming
  • aquaculture
  • cm jagan
  • letter
  • lokesh letter to jagan

తాజావార్తలు

  • T20 World Cup 2026 ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ రేస్‌లో ఉంది వీరే .. భారత్‌ నుంచి ఒకేఒక్కడు.. బుమ్రాకు దక్కని చోటు..!

  • Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..

  • Israel Iran War: యుద్ధం ఇలాగే కొనసాగితే వినాశనం తప్పదు.. గల్ఫ్ దేశం వార్నింగ్..

  • Water Supply: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఈ ఏరియాల్లోనే..

  • Rana Daggubati: కొత్త కంటెంట్ కోసమే నా అన్వేషణ: రానా

ట్రెండింగ్‌

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions