NTV Telugu Site icon

Jr. NTR political Entry: జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Jr. Ntr Political Entry

Jr. Ntr Political Entry

Jr. NTR political Entry: జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరు మాత్రం.. ఈ పరిణామం ఇష్టం లేదు అనేలా వ్యవహరిస్తూ వస్తున్నారు.. అయితే, విపక్షం మాత్రం.. నారా లోకేష్‌ రాజకీయ భవిష్యత్‌ కోసమే.. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కన పెడుతున్నారనే విమర్శలు చేశారు.. చంద్రబాబు అవసరానికి వాడుకొని వదిలేసే రకం అంటూ ఆరోపణలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వ్యాఖ్యానించారు.. తిరుపతి నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతుండగా.. అభివృద్ధిని కోరుకునేవారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.. రాజకీయాలకు కావాల్సింది మంచి మనసు.. 2014లో పవన్ కల్యాణ్‌ మంచి మనసును చూశానని చెప్పుకొచ్చారు.

Read Also: Bank Holidays in March 2023 List: మార్చిలో బ్యాంకులకు దండిగా సెలవులు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు లోకేష్‌… అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ లో మంచి మనసును చూశానని లోకేష్‌ చెప్పుకొచ్చారు.. కాగా, నారా లోకేష్‌ పాదయాత్రలో భాగంగా ఈ రోజు ఆటోడ్రైవర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని.. దీంతో నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్‌.

Read Also: Physical Harassment: మైనర్‌ కుమార్తెపై లైంగిక దాడి.. కీచక తండ్రికి పదేళ్ల జైలు శిక్ష

ఇక, పింక్ డైమండ్ పై స్పందించారు నారా లోకేష్.. ఈ పింక్ డైమండ్ లొల్లి నాకే అర్థం కావడం లేదన్న ఆయన.. చంద్రబాబు పాలనలో తిరుపతి వెంకన్న పింక్ డైమండ్ కొట్టేశామని విజయసాయిరెడ్డి అన్నారు. వెంకటేశ్వరస్వామి జోలికి వెళితే వాళ్ల పని గోవిందా.. గోవిందా.. అన్నారు.. అన్ని కొండలు ఎందుకు అని మాట్లాడిన వారు ఏమయ్యారో మనం గతంలో చూశామన్న ఆయన.. ఎవరైతే మాపై ఆరోపణలు చేశారో ఈ నాలుగేళ్ల వాళ్ల పాలనలో ఏం పీకారు? ఎన్నికల తర్వాత పింక్ డైమండ్ గురించి మాట్లాడారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆరోపణలు చేయడం చాల ఈజీ.. నేను ఏనాడూ తప్పు చేయలేదు.. అందుకే తిరుపతి నడివీధుల్లో నడుస్తున్నాను అని తెలిపారు నారా లోకేష్‌. అయితే, స్వయంగా నారా లోకేష్‌ నోట.. జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటిక్‌ ఎంట్రీ మాట రావడం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. దీనిపై ఎన్టీఆర్‌ ఎలా స్పందిస్తారు.. ఆయన్ను సమర్థించేవారి రియాక్షన్‌ ఏంటోచూడాలి మరి.