టీడీపీ నేత పట్టాభికి ఏం జరిగినా డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం వైఎస్ జగన్‌దే అన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పట్టాభి అరెస్ట్‌పై స్పందించిన ఆయన.. ప్రజల్ని రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి… కానీ, దాడికి గురైన పట్టాభినే అరెస్ట్ చేశారని.. దీంతో.. వీరు ప్రజల కోసం పనిచేసే పోలీసులు కాదని తేలిపోయిందన్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు, ప్రతిపక్ష నేతలకీ రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేసిన నారా లోకేష్.. పట్టాభికి హానితలపెట్టాలని పోలీసులు చూస్తున్నారని.. ఆయనకు ఏమైనా జరిగితే డీజీపీ, సీఎందే బాధ్యత అన్నారు.. తక్షణమే పట్టాభిని కోర్టు ముందు హాజరుపర్చాలని డిమాండ్ చేశారు.. బోస్‌డీకే అనేది రాజద్రోహం అయితే.. వైసీపీనేతల అసభ్య భాష ఏ ద్రోహం కిందకి వస్తుందో డీజీపీ చెప్పాలన్నారు లోకేష్.. డ్రగ్స్ గుట్టురట్టు చేస్తున్నారనే పట్టాభిని అదుపులోకి తీసుకున్నారని ప్రజలకీ అర్థమైందన్న ఆయన.. ఎన్ని దాడులు చేసినా, ఎంత మందిని అరెస్ట్ చేసినా.. దేశానికే ముప్పుగా పరిణమించిన వైసీపీ, డ్రగ్స్ మాఫియా ఆట కట్టించేవరకూ టీడీపీ పోరాటం ఆగదని ప్రకటించారు.
అది తేలిపోయింది.. పట్టాభికి ఏది జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత..!
