NTV Telugu Site icon

Nara Devansh: ఇద్దరు తాతయ్యల్ని ఆటపట్టించిన నారా దేవాన్ష్

Babu1

Babu1

సంక్రాంతి సందర్భంగా నారావారాపల్లెలో సందడి నెలకొంది. అటు నారా వారి కుటుంబం, ఇటు నందమూరి వారి కుటుంబంతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తిరుపతి నాగాలమ్మకట్ట వద్ద ఆసక్తిగా సాగాయి తాత, మనవడి ఆటలు. బ ఇటు బాలకృష్ణ, చంద్రబాబును ఆటపట్టించాడు నారా లోకేష్ తనయుడు, చంద్రబాబు, బాలకృష్ణల ముద్దుల మనవడు దేవాన్ష్. నాకు కావాలంటూ చంద్రబాబును కుర్చీలోంచి లేపేశాడు దేవాన్ష్. తాత బాలకృష్ణను కూడా వదలలేదు దేవాన్ష్.. నీళ్ల బాటిల్ తో సరదాగా తలపై కొట్టిన దేవాన్ష్ అల్లరి చేశాడు.

Read Also: India vs Sri Lanka 3rd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. తుది జట్టులో కీలక మార్పులు

ఒకవైపు ఆలయం వద్ద మహిళలు పూజలు చేస్తుంటే …. మనవడితో ఆడుకున్నారు చంద్రబాబు,బాలయ్య. నారా వారి కుటుంబంలోని బంధువులు, ఇటు నందమూరి కుటుంబంలోని బాలకృష్ణ, భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞ తేజ సందడి చేశారు. నారావారి పల్లెలో తల్లిదండ్రులు సమాధుల వద్ద నివాళులర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… బట్టలు పెట్టి తర్పణం అర్పించారు చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే.. రేపు అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్ళనున్నారు.

జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు చంద్రబాబు. ఈ నెల 7వ తేదీన రొంపిచర్లలో చల్లా బాబు ఫ్లెక్సీలను చింపడానికి వచ్చిన వైసిపి కార్యకర్తలను నాడు అడ్డుకున్నారు టిడిపి క్యాడర్. నాటి ఘటనలో టిడిపి – వైసిపి కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టీడీపీ క్యాడర్ పై హత్యాయత్నం సెక్షన్ సహా పలు సెక్షన్లతో కేసులు పెట్టారు. 8 మంది టీడీపీ కార్యకర్తలను 10వ తేదీ అరెస్టు చేశారు పోలీసులు. జైలులో ఉన్న టిడిపి కార్యకర్తలను పీలేరు సబ్ జైలుకు వెళ్లి రేపు పరామర్శించనున్నారు పార్టీ అధినేత చంద్రబాబు.

Read Also: Tummala Nageshwar Rao: 18న దేశ రాజకీయాల్లో మార్పుకి ఖమ్మం వేదిక కానుంది

Show comments