Site icon NTV Telugu

Nandyal Crime: పెళ్లి పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..

Crime

Crime

Nandyal Crime: నంద్యాల జిల్లాలో పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేయడంతో.. మైనర్ బాలిక బలైంది. నందికొట్కూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో వ్యాసమోల్ తాగి బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది బాధితురాలు..

Read Also: Nara Lokesh: ఆర్టీసీ డ్రైవర్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మంత్రి లోకేష్.. ట్వీట్ వైరల్

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మిడుతూరుకు చెందిన మైనర్ బాలిక కర్నూలు కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. బాలికను తెలంగాణ పెబ్బేరు మండలం వెంకటాయంపల్లికు చెందిన.. సమీప బంధువు అయిన యువకుడు పెళ్లి చేసుకోవాలని వేధించినట్లుగా చెబుతున్నారు.. బాలికకు యువకుడు సమీప బంధువు కావడంతో ఇద్దరికి వివాహం చేయాలని పెద్దల మధ్య కూడా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, అప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంలోని బాలిక.. ఇంకా చదువుకోవాలని, పెళ్లికి సమయం కావాలని చెబుతూ వచ్చింది.. కానీ, కర్నూలులో కంప్యూటర్ సెంటర్ వద్ద పెళ్లి చేసుకోవాలంటూ బాలికతో సదరు యువకుడు వాగ్వాదానికి దిగాడు.. చదువు అవసరం లేదు పెళ్లి చేసుకుందామంటూ ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తుంది.. దీంతో.. విసిగిపోయిన బాలిక వాసమోల్ కొని నందికొట్కూరు బస్టాండ్ దగ్గర తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.. అయితే, బాలికను కర్నూలుకు తరలించగాలో.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, ఈ ఘటనపై బాలిక బంధువులు నోరు మెదపడం లేదు.

Exit mobile version