NTV Telugu Site icon

Srisailam Dam Safety: శ్రీశైలంలో ముగిసిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల పరిశీలన.. నవంబర్‌లో టెండర్లు..

Srisailam

Srisailam

Srisailam Dam Safety: శ్రీశైలం జలాశయంపై ప్రపంచ బ్యాంక్, డ్యామ్ పేఫ్టీ, సీడబ్ల్యూసీ అధికారుల పరిశీలన ముగిసింది.. యాంటీ జలాస్కి ప్రపంచ బ్యాంక్ టెక్నికల్ ఎక్స్పర్ట్ వారితో పాటు ముక్కల రమేష్, రాజగోపాల్, సీడబ్ల్యూసీ సేలం ఆధ్వర్యంలో నిన్న.. ఈరోజు రెండు రోజుల పాటు పరిశీలన జరిగాయి.. రెండు రోజులుగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జలాశయం అధికారులతో కలిసి సమావేశమై జలాశయానికి సంబంధించిన ప్లాంజ్ ఫుల్, అప్రోచ్ రోడ్డు డ్యామ్ గేట్లు.. కొండ చర్యలకు సంబంధించిన వాటిని అధికారులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో మొదటి పేజ్ కింద 103 కోట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం తెలిపినట్లు జలాశయం అధికారులు తెలిపారు. పరిశీలన అనంతరం జలాశయం వ్యూ పాయింట్ వద్ద డ్యామ్ సేఫ్టీ, సీడబ్ల్యూసీ అధికారులతో ముఖాముఖిగా చర్చించి జలాశయానికి సంబంధించిన మరమ్మత్తుల వివరాలను సమర్పించారు.

Read Also: PM Modi: రెండు రోజుల పాటు లావోస్ పర్యటనకు ప్రధాని మోడీ..

అనంతరం జలాశయం సీఈ కబీర్ డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. డ్యామ్ మరమ్మతుల పేజ్ 1 కింద 103 కోట్లకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం లభించిందని.. ఈ సంవత్సరం నవంబర్ లో డ్యామ్ మరమ్మత్తులకు టెండర్లు పిలవనున్నట్లు కబీర్ భాష తెలిపారు.. గతంలో వరదల కారణంగా డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ కి.. ముఖ్యంగా 10 కోట్లు కేటాయింపు ఉంటుందన్నారు.. అలానే జలాశయం అప్రోచ్ రోడ్డు, కొండ చరియల మరమ్మత్తులకు మొదటి విడతగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అంగీకారం తెలిపారు.. అయితే 2011 నుండి 2024 వరకు పూడిక ద్వారా జలాశయం 9 టీఎంసీలు నీరు మాత్రమే తగ్గిందని డ్యామ్ కు ఎటువంటి ఇబ్బంది లేదని డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ అన్నారు. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జలాశయానికి 103 కోట్ల ఆమోదం తెలపడం ఆనందకరమైన విషయమని డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ పేర్కొన్నారు.. డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ ప్రస్తుతం సుమారు 46 మీటర్ల లోతు ఉందని.. అలానే మరో మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ పూడికపై అధ్యయనం చేస్తామని డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ మీడియాకు వెల్లడించారు.