NTV Telugu Site icon

Seaplane: శ్రీశైలంలో సేఫ్‌గా ల్యాండ్ అయిన సీ ప్లేన్.. ట్రయల్‌ రన్‌ విజయవంతం..

Seaplane

Seaplane

Seaplane: టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా సీ ప్లేన్‌ టూరిజానికి శ్రీకారం చుట్టనుంది.. విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ను నడిపేందుకు సిద్ధమైంది.. ఇక, దీనికి సంబంధించిన ట్రయల్‌ రన్ కొనసాగుతోంది.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగలో సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. ట్రయల్ రన్ లో భాగంగా సేఫ్ గా నీటిపై ల్యాండ్ అయ్యింది సీ ప్లేన్.. ఇక, సీ ప్లేన్ ట్రయల్ రన్ ని దగ్గరుండి పరిశీలించారు నంద్యాల జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. కాగా, రేపు విజయవాడలో సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంతేకాదు.. విజయవాడ నుంచి సీ ప్లేన్ లో బయల్దేరి.. శ్రీశైలం వరకు ప్రయాణించనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు.. పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.. దీంతో.. ఇప్పటికే శ్రీశైలం పరిసరాలు, పాతాళగంగ పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్నాయి భద్రత బలగాలు..

Read Also: India–Russia Relations: భారత్‭పై మరోసారి ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు

ఇక, సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా శ్రీశైలంలో ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. పాతాళగంగలో సీ ప్లేన్ ల్యాండింగ్, రోప్ వే, రోడ్డు మార్గంలో దర్శనానికి వెళ్లే దారులలో ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు.. శనివారం రోజు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి సీ ప్లేన్ లాంఛనంగా ప్రారంభించి.. సీ ప్లేన్ లో శ్రీశైలం పాతాళగంగంలో ల్యాండ్‌కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు.. ఇక, అదే సీప్లెన్‌లో తిరిగి విజయవాడలోని పున్నమి ఘాట్‌కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.

Show comments