Sankranti Brahmotsavam in Srisailam: శ్రీశైలంలో ఈనెల 11 నుండి 17 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.. పంచాహ్నికదీక్షతో 7 రోజులపాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. ప్రతి సంవత్సరం సంక్రాంతి, శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం దేవస్థానం ఆనవాయితీగా వస్తుంది.. అయితే, ప్రతీ ఏడాది సంక్రాంతి బ్రహ్మోత్సవాల తర్వాత.. శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించే విషయం విదితమే.. ఇక, ఈ నెల 11న ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం 12 నుండి శ్రీస్వామి అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తారు.. 14న శ్రీస్వామి అమ్మవార్లకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుండి 17 వరకు రుద్ర, చండి, మృత్యుంజయ, గణపతి హోమాలు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.. శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణం, ఉదయాస్తమాన, ప్రాతఃకాల, ప్రదోషకాల, ఏకాంత సేవలు కూడా నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు..
Read Also: HMPV Virus: HMPV వైరస్‌పై ఆందోళన అవసరం లేదు.. వైద్య నిపుణుల సూచన
ముక్కంటి మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సైతం భక్తులు లక్షలాదిగా క్షేత్రానికి తరలివస్తారు.. అలానే మరిపక్క వేలాది మంది భక్తులు నల్లమలలో పాదయాత్ర చేస్తూ దట్టమైన అటవీప్రాంతంలో నుండి సుమారు 40 కిలోమీటర్లు కాలిబాటలో శ్రీశైలాన్ని చేరుకుంటారు భక్తులు.. పాదయాత్రగా వచ్చే అటవీ ప్రాంతామైన వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట, పెద్ద చెరువు ప్రాంతాలను ఇప్పటికే ఈవో శ్రీనివాసరావు దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, అటవీశాఖ సిబ్బందితో పరిశీలించారు భక్తులు వచ్చే పాదయాత్ర మార్గంలో గ్రావెల్ వేసి చదును చేయాలని నాగలూటి వద్ద జంగిల్ క్లియరెన్స్ చేసి గత సంవత్సరం కంటే అధికంగా పైప్ పెండాల్స్ వేయాలని ప్రతిచోటా 5 ప్రదేశాలలో చలువ పందిళ్లు వేయాలని ఒక్కక్క పందిరిలో సుమారు వేయి మంది సేదతిరేలా ఉండాలని చెప్పారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా పైప్ పెండల్స్ ఏర్పాటు చేయాలని అలానే నాగులూటి వీరభద్రస్వామి ఆలయానికి రంగులు వేయాలని ఆదేశించారు. గత సంవత్సరం కంటే ఎక్కువగా వాటర్ ట్రాక్టర్లు పంపి నాగలూటి వద్ద అన్నదానం చేస్తున్న భక్తబృందాలకు దేవస్థానం పక్షాన పూర్తి సహాయసహకారాలను అందించాలన్నారు. అలాగే జనరేటర్లు ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుత్ ఏర్పాటు చేయాలన్నారు నాగలూటివద్ద పుష్కరిణిని అలానే భావిని శుభ్రపరిచి భక్తులకు అందుబాటులోకి తేవాలని అలానే తాత్కాలిక శౌచాలయాలు ఏర్పాటు చేయాలని కాలిబాటలో వచ్చే భక్తులకు జిల్లా వైద్యశాఖతో సమన్వయంతో వైద్యశిబిరాలు ఏర్పాటు పూత మందులు, మాత్రలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు..
Read Also: AP Government: HMPVపై ఏపీ సర్కార్ అలెర్ట్.. సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..
శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తరలివచ్చే భక్తులు సంతృప్తికరమైన సమాధానం అనుభవాన్ని పంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఈవో శ్రీనివాసరావు అన్నారు.. ముఖ్యంగా దర్శనం విషయంలో క్యూలైన్స్ లో భక్తులకు ఒత్తిడి లేకుండా ఏ లైన్ దేనికి అనేలా ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు దట్టమైన ఆటవిమార్గంలో వచ్చే పాదయాత్ర భక్తులకు మంచినీరు,చలువ పందిళ్లు,వైద్య శిబిరాలు భక్తులకు తగ్గట్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని అటవీ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న మంచినీరు త్రాగడానికి బాగుందా లేదా చూసి దేవస్థానం ప్రత్యేక టాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామన్నారు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గత సంవత్సరం కంటే 15% ఏర్పాట్లు ఎక్కువగా చేస్తామని ఈనెల 31 లోపు శివరాత్రి ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యేలా చూసి మిగిలిన 19 రోజులు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే వాటిని సరి చేసేలా చూస్తామన్నారు ప్రతి శాఖతో సమన్వయం చేసుకునేందుకు ఇప్పటికే ఆయా శాఖలకు 54 లేఖలు పంపించమన్నారు ముఖ్యంగా ఉత్సవాలలో ప్రధాన సమస్యగా భక్తులు వాడిపడేసిన చెప్పులు,బట్టలు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్ కు తరలిస్తామని ఈ సంవత్సరం జరగబోతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై సంక్రాంతి ముందుగానే తర్వాత గాని జిల్లా కలెక్టర్ తో సమావేశం ఏర్పాటు ఉంటుంది ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు..