Site icon NTV Telugu

Nandyal Tragedy: ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు మృతి

Nandyala

Nandyala

Nandyal Tragedy: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం రోడ్డు డివైడర్ ను కొట్టి CGR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్వాలిస్ వాహనం నుజ్జునుజ్జైంది. ఇక, క్వాలిస్ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికకడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక, మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.

Read Also: IND vs SL: నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20.. అభిమానులకు ప్రత్యేక సందర్భం!

అయితే, క్వాలిస్ వాహనంలోనే ఇరుక్కున్న మృతదేహాలను తొలగించి ఆళ్లగడ్డలోని ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రమోద్ కుమార్ పరిశీలించారు. మృతులంతా క్యాటరింగ్ సిబ్బంది.. యాత్రకు వెళ్లే వారి కోసం వంట చేసేందుకు వెళ్లిన క్యాటరింగ్ చేస్తుంటారు.. మృతులు గుండెరావు, శ్రవణ్, నరసింహ, బన్నీగా గుర్తించాం.. అలాగే, గాయపడిన వారు శివసాయి, సిధార్థలు.. హైదరాబాద్ నిజం కాలేజీలో గుండెరావు కుమారులు సిధార్థ, శివసాయి చదువుతున్నారు. గత 15 రోజులుగా యాత్ర చేస్తున్న బస్సుకు వంట చేసేందుకు గుండెరావు టీం వెళ్లిందని డీఎస్పీ తెలిపారు.

Exit mobile version