Site icon NTV Telugu

Danish Road Project: డానిష్‌ ఫైబర్‌ టెక్నాలజీతో రోడ్లు.. ఏపీలో తొలిసారి..!

Danish Road Project

Danish Road Project

Danish Road Project: ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆధునిక టెక్నాలజీతో ఏపీ రహదారులు పటిష్టంగా మారనున్నాయి, రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా డెన్మార్క్ డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ఆర్ అండ్‌ బీ శాఖ వినూత్న ప్రయోగంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. నంద్యాల జిల్లా సంజామల ముదిగేడు డబుల్ లైన్ రోడ్డులో పైలెట్ ప్రాజెక్టుగా కిలో మీటర్ మేరకు డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ప్రయోగాత్మకంగా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ వినూత్న ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్ర మొత్తం డానిష్ ఫైబర్ టెక్నాలజీతో కూడిన రహదారులు రూపు దిద్దు కొనున్నాయి.

Read Also: Teacher and Students: మరో స్కూల్‌కి ఉపాధ్యాయుడి బదిలీ.. మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్ అంటూ విద్యార్థుల కన్నీరు..

డెన్మార్క్ కు చెందిన డానిష్ ఆస్ఫాల్ట్ రీ-ఇన్ఫోర్సింగ్ ఫైబర్ ఆధునాతన టెక్నాలజీతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హీత్రో ఎయిర్‌ పోర్ట్ (యూకే), దుబాయ్ మెట్రో, A7 మోటార్‌ వే జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో భారీ ప్రాజెక్టుల్లో ఇప్పటికే విజయవంతం గా ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ద్వారా అరమిడ్ మరియు పాలియోలెఫిన్ అనే అధిక బలం కలిగిన ఫైబర్లు ఆస్ఫాల్ట్ మిశ్రమంలో కలప బడతాయి.. ఇందులో ఉన్న జిగురు వంటి రసాయనిక ద్రవం, తారులో కలవడం వల్ల ప్లాస్టిక్ లాంటి పొర ఏర్పడుతుంది.. ఈ ప్రక్రియ ద్వారా సాధారణంగా రహదారులపై ఏర్పడే పగుళ్లు, గుంతలను నియంత్రించే సామర్థ్యం అత్యధికంగా ఉంటుంది.

Read Also: School Education Department: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 20 మంది విద్యార్థులు ఉంటే చాలు!

ప్రపంచ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనుల్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. నూతన టెక్నాలజీతో కూడిన డానిష్ ఆస్ఫాల్ట్ రీ-ఇన్ఫోర్సింగ్ ఫైబర్ టెక్నాలజీతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన సొంత నియోజకవర్గ బనగానపల్లెలో పైలట్ ప్రాజెక్ట్ గా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. డ్యానిష్ ఫైబర్ టెక్నాలజీ ప్రత్యేకంగా తారు రోడ్లను పటిష్టంగా నిర్మించడం కోసమే రూపొందించిన అధునాతన విధానమని డెన్మార్క్ బృందం సభ్యులు చెబుతున్నారు.. రోడ్లపై వచ్చే పగుళ్లు, చీలికలు, ప్రకృతి వైఫరీత్యాలు వంటి కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుని, కనీసం 8 ఏళ్ల ధీర్ఘ కాలం పాటు డానిష్ టెక్నాలజీ రోడ్లు మన్నిక ఉంటాయని తెలిపారు.. ఈ టెక్నాలజీతో నిర్మించిన రోడ్ల లో ఉన్న ఫైబర్ హెవీ లోడ్స్, కంటెనర్ల వంటి భారీ వాహనాల ఒత్తిడి భారాన్ని అన్ని వైపుల నుంచి త్రి డైమన్షనల్ గా ఎదుర్కొవడం వల్ల రోడ్ల పై ఆయా ప్రాంతాల్లో ఏక కాలంలో ఒక చోటే ఎక్కువ భారం పడకుండా ఫైబర్ టెక్నాలజీ నియంత్రించగలిగే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు..

Read Also: Off The Record: జనసేన తరపున క్రాంతి.. తండ్రి, తమ్ముడిని ఢీ కొట్టబోతున్నారా..?

అత్యధిక వాహనాలతో నిరంత రాయంగా రద్దీగా ఉండే రోడ్లపై హెవీలోడుతో కూడిన రవాణా వాహనాలు, ప్రయాణించినా కూడా ఎలాంటి ఒత్తిడి పడకుండా ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా నిర్మించే రోడ్ల నాణ్యతా ప్రమాణాలు పెరగడంతో పాటు, మెయింటె నెన్స్ ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటాయని రహదారుల జీవితకాలం కూడా 50 శాతం పైగా పెరగనుంది. ప్రభుత్వానికి కొత్త యంత్రాలు అవసరం లేకుండానే ఈ డ్యానిష్ ఫైబర్ టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం ఉండటం తో పాటు ఈ రోడ్లపై వాడిన డానిష్ ఫైబర్ ను తిరిగి వినియోగించుకునే వెసులు బాటు కూడా ఉంటుంది.. పర్యావరణ పరంగా ఎలాంటి హాని లేకుండా ఉంటుంది. ఆధునిక సాంకేతికత తో కూడిన మెరుగైన రహదారుల కల్పించాలనే లక్ష్యంతో ఈ ఫైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం జరిగిందినీ, డాక్నిస్ ఫైబర్ టెక్నాలజీ పనులను పర్యవేక్షించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version