నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. తాజాగా.. కొలిమిగుండ్ల మండలంలో న్యూట్రల్‌గా ఉన్న 30 కుటుంబాలతో సహా.. 15 మంది వైసీపీ దళిత నేతలు, ఎర్రబోతుల కుటుంబానికి చెందిన కీలక నేత కూడా బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం కొలిమిగుండ్ల మండలంలో జరిగిన చేరికల కార్యక్రమంలో భాగంగా.. గత కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గూడూరు నాగేశ్వర్ రెడ్డి, గూడూరు నాగ శేష రెడ్డి, గూలి నాగేశ్వర్ రెడ్డి, గూలి జయరామ రెడ్డి, పీరం హర్షవర్ధన్ రెడ్డి వంటి నేతలతో సహా మొత్తం 30 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే దాసరి పెద్ద దస్తగిరి, దాసరి బాలుడు,దాసరి నడిపి దస్తగిరి, దాసరి పుల్లయ్య, నారాయణ స్వామి, దాసరి హరి, దాసరి రాజేష్, దాసరి విష్ణు వర్ధన్ వంటి 15 మంది నేతలు కుటుంబాలతో సహా వైసీపీని వీడి బీసీ జనార్థన్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీసీ జనార్థన్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబును, బనగానపల్లె అభివృద్ధి కోసం బీసీ జనార్థన్ రెడ్డిని గెలిపించుకుని తీరుతామని ప్రకటించారు.
Ajay Manikrao: లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా మానిక్‌రావ్ నియామకం
అనంతరం కొలిమిగుండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మరో చేరికల కార్యక్రమంలో ఎస్సీ కాలనీ దళిత నాయకులు టీడీపీలో చేరారు. జగన్ రెడ్డి అరాచక పాలనలో దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుల వేధింపులకు విసుగెత్తిన బుగ్గ రాముడు, జీవయ్య, ఓబులేసు, బండ్రా వాసు, పేతురు, బాలయ్య మరో 15 మంది దళిత నేతలు కుటుంబాలతో సహా వైసీపీని వీడి బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన దళిత నేతలు మాట్లాడుతూ… వైసీపీలో దళితులకు ప్రాణాలకు రక్షణ లేదని అని అన్నారు. దళితుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని అన్నారు. బీసీ జనార్థన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసారని కితాబు ఇచ్చారు. దళితుల స్థలాలు కబ్జాలు చేస్తూ తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడించి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి గారి గెలిపించుకుంటామని దళిత నేతలు ప్రకటించారు.
Odisha: బీజేడీలో రికార్డ్ బ్రేక్.. పోటీకి 10 వేల మంది అప్లై!
ఇక కొలిమిగుండ్ల మండంలోని నాయినిపల్లి గ్రామంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎర్రబోతుల వర్గానికి చెందిన కీలక నేత సైకిలెక్కేసారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి సమీప బంధువు ఎర్రబోతుల నాగిరెడ్డి తన అనుచరులతో సహా బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి, టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బనగానపల్లెలో బీసీ జనార్థన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఈ రెండు నెలలు పట్టుదలగా పని చేద్దామని పిలుపునిచ్చారు. మొత్తంగా కొలిమిగుండ్లలో బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా వైసీపీ కీలక నేతలు వరుసగా సైకిలెక్కడం టీడీపీ క్యాడర్‌లో సరికొత్త జోష్ నెలకొల్పగా, ఎన్నికలకు ముందు కీలక నేతలు టీడీపీలోకి వలసలు వెళ్లడం వైసీపీ క్యాడర్‌లో నైరాశ్యాన్ని కలిగిస్తోంది. ఎన్నికల ముందు బనగానపల్లె నియోజవర్గంలో వైసీపీకి పట్టుఉన్న కొలిమిగుండ్ల మండలంలో టీడీపీలోకి వలసలు షురూ అవుతుండడంతో ఈసారి ఎన్నికల్లో బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.