Site icon NTV Telugu

Srisailam: శ్రీశైలం ఆలయంలో మరోసారి భారీగా బదిలీలు..

Srisailam

Srisailam

Srisailam: శ్రీశైలం దేవస్థానంలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల స్థానిక అంతర్గత బదిలీలు జరిగాయి.. ఏకంగా 95 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.. దీంతో, శ్రీశైలం దేవస్థానంలో 95 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగినట్టు అయ్యింది.. ఏఈవో స్థాయి నుంచి కంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ వరకు మొత్తంగా 95 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్దఎత్తున బదిలీలు జరగడం ఇది రెండోసారి.. అయితే, శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌలభ్యం కోసమే ఉద్యోగులను అంతర్గత బదిలీలు జరిగాయని చెబుతున్నారు.. అలాగే అదనపు బాధ్యతలు అప్పగించారు.. బదిలీలలో డిప్యూటీ ఈవోకు దేవస్థానంలో 8 విభాగాలకు సంబంధించి విధులు కేటాయించారు.. అసిస్టెంట్‌ కమిషనర్‌ మరియు ఏఈవో చంద్రశేఖర్ కు దేవస్థానంలో 4 విభాగాలకు సంబంధించిన విధులు కేటాయించినట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల ప్రకారం.. సంబంధిత ఉద్యోగులు ఇప్పటి వరకు నిర్వహించిన విధుల నుంచి నూతనంగా కేటాయించిన విధులకు హాజరుకావాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు..

Read Also: Gold Rates: బంగారం మరింత ప్రియం.. ఒక్క రోజే రూ. 430 పెరిగిన తులం గోల్డ్ ధర

Exit mobile version