NTV Telugu Site icon

JD Lakshminarayana: రానున్న ఎన్నికల్లో జేడీ పోటీ చేసే స్థానమిదే.. అసెంబ్లీ స్థానాల్లో పోటీపై క్లారిటీ

Jd Laxminarayana

Jd Laxminarayana

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు విశాఖ నుంచి పోటీ చేస్తానని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. రాబోయే ఎన్నికల్లో మూడురోజులు పోలింగ్ జరపాలని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెబ్ సైట్స్ లో పొందు పరచాలని సుప్రీమ్ తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు పోలింగ్ శాతాన్ని నియంత్రిస్తున్న విధానాన్ని జై భారత్ నేషనల్ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు.

Pawan Kalyan: రేపు విశాఖకు జనసేనాని..

ఈరోజు శ్రీశైలం(మం) సున్నిపెంటలో జేడీ లక్ష్మీనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం లేని ఏపీని సాధించుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది, ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అని తెలిపారు.
తమ పార్టీ గెలిస్తే ఆడబిడ్డ పుడితే ఎర్రచందనం, టేకు చెట్లు నాటిస్తామన్నారు. అమ్మాయి 21 ఏళ్ల వయసు వచ్చాక చెట్లను అమ్మి డబ్బులు ఆస్తిగా ఇస్తామని తెలిపారు.

JP Nadda: మోడీ హ్యాట్రిక్ ప్రధాని కావడం ఖాయం

ప్రత్యేక హోదాపై ఏపార్టీ నోరు మెదపదు.. ఒకరేమో నా దగ్గర కేంద్రం పెద్దల నెంబర్లు ఉన్నాయి అంటారు.. మాట్లాడి హోదా తీసుకురావొచ్చుగా అని అన్నారు. మరొకరేమో 25 ఎంపీలు ఇస్తే హోదా తెస్తా, మరొకరేమో హోదా ముగిసిన అధ్యాయం అంటారని విమర్శించారు. ఉచిత హామీలు చూస్తే బస్సు, గ్యాస్ సిలిండర్లు నిరుద్యోగ భృతి అంటారు.. ఇప్పటికే 11 లక్షల కోట్లు అప్పు ఉంది.. ఇక డబ్బు ఎలా తెస్తారని ప్రశ్నించారు. 2021కి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు.. దాని సంగతేంటి.. రాష్ట్రం పాతాళంలోకి వెళ్ళింది దానిని బయటికి తీయాలంటే తమకు అవకాశం ఇవ్వండని అన్నారు.