Site icon NTV Telugu

Leopard Hunting : నంద్యాల – గిద్దలూరు ఘాట్ రోడ్డులో చిరుత హల్చల్..

Leopard

Leopard

Leopard Hunting : నంద్యాల జిల్లాలోని నల్లమలలో చిరుతల కలకలం సృష్టించింది. నంద్యాల, గిద్దలూరు ఘాట్ రోడ్డు లోని పచర్ల గ్రామం వద్ద చిరుత సంచారం జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. శనివారం రాత్రి నిద్రపోతున్న దినసరి కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది. దింతో ఆమెకు తలకు తీవ్ర గాయాలయాయ్యి. దాడి జరుగుతున్న సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కర్రలతో తరమడంతో చిరుత అక్కడి నుండి పరారైంది. మే నెలలో కూడా టోల్ గేట్ వద్ద వాచ్ మెన్ భాష పై దాడికి పాల్పడింది చిరుత. ఇక ఆ చిరుతను పట్టుకోవడానికి రెండు బోన్లను అటవీ అధికారులు ఏర్పాటు చేయనున్నారు. పచర్ల గ్రామం అభయారణ్యంలో ఉండడంతో ఇలా అనేకసార్లు క్రూర మృగాలు గ్రామంలోకి వచ్చి అనేకమార్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

Nandyal : మున్సిపల్ చైర్ పర్సన్ పై అట్రాసిటీ కేసు నమోదు..

ఇక మరోవైపు నంద్యాల జిల్లాలోని మహానంది సమీపంలోని న్యూ బిల్డింగ్స్ వద్ద కూడా చిరుత కనిపించింది. గడిచిన నెల రోజుల్లో మహానంది చుట్టూ పక్కల ప్రాంతాలలో చాలా చోట్ల చిరుత సంచరించినట్లు సమాచారం. ఆ సమయంలో చిరుతను చూసి ప్రాణ భయంతో గిరిజనులు పరుగులు తీస్తున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో అటవీ అధికారులను చిరుత పట్టుకోవాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Thandel : వాస్తవ ఘటనల ఆధారంగా నాగచైతన్య ‘తండేల్’..

Exit mobile version