NTV Telugu Site icon

Heavy Rain in Srisailam: శ్రీశైలంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షం.. బెంబేలెత్తిన భక్తులు, స్థానికులు

Srisailam

Srisailam

Heavy Rain in Srisailam: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపిలేని కుంభవృష్టి కురిసింది.. క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు భారీ వర్షం పడింది.. వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు.. ఎగువన అటవీప్రాంతం నుండి నీరు ప్రవాహంలో బైక్‌లు కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక, వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో ఇంటి బయట జీపుల్లోనూ స్థానికులు గడపాల్సి వచ్చిందట.. లాలితంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో కె,ఎల్ బ్లాక్ మధ్య నుండి వర్షపు నీటి ప్రవాహం ఉధృతంగా సాగింది.. రాత్రి కురిసిన కుంభవృష్టి వర్షం ధాటికి బెంబేలెత్తిపోయారు శ్రీశైలం గ్రామస్థులు, భక్తులు, పర్యాటకులు..

Read Also: Siddipet Crime: చేర్యాలలో సైబర్‌ మోసం.. పోలీసుల పేరుతో 30 వేలు కాజేసిన కేటుగాళ్ళు

మరోవైపు.. శ్రీశైలం జలాశయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.. శ్రీశైలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుపై పడిపోయాయి బండరాళ్లు.. అయితే, రాత్రి సమయానికి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.. ఇక, రోడ్డుపై పడ్డ కొండచరియలు, బండరాళ్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇక, శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది.. ఇన్ ఫ్లో 96,631 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 37,328 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే.. ప్రస్తుత నీటిమట్టం 881.70 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటి నిల్ల 197.4617 టీఎంసీలుగా ఉందని.. మరోవైపు.. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోగా.. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..