NTV Telugu Site icon

Srisailam Temple: శ్రీశైలంలో శరన్నవరాత్రి మహోత్సవాలు.. నేడు కాళరాత్రి అలంకారంలో అమ్మవారి దర్శనం

Srisailam

Srisailam

Srisailam Temple: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఏడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, గజవాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.. మరోరోజు ఆరో రోజు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగాయి..

Read Also: Viral News: ట్యాక్సీడ్రైవర్ నుంచి మెసేజ్ రాగానే.. లండన్‌లో పిల్లలను వదిలేసి హైదరాబాద్‌కు..

శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా.. శ్రీస్వామి అమ్మవారు హంసవహనపై కొలువుదీరిన శ్రీస్వామి అమ్మవారికి ఆలయ అర్చకులు శాస్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం అమ్మవారిని పుష్పపల్లకిలో అధిరోహించి ప్రత్యేకపూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు.. అనంతరం విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైలం క్షేత్ర పురవీధులలో కాత్యాయని అలంకారంలోని అమ్మవారు.. శ్రీస్వామివారు ప్రత్యేకంగా తయారు చేసిన పుష్పపల్లకిలో గ్రామోత్సవానికి తరలుతుండగా ఉత్సవం ముందు కేరళ చండీమేళం కేరళ సంప్రదాయ డ్రమ్స్ కొమ్ము కోయ నృత్యం థయ్యం, సంప్రదాయ నృత్యం విళక్కు సంప్రదాయ నృత్యం స్వాగత నృత్యం సంప్రదాయ నాట్యం నడుమ ఆలయ గంగాధర మండపం వద్ద పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారు గ్రామోత్సవంలో భక్తులను కటాక్షించారు.. గంగాధర మండపం నుండి పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారు అంకాలమ్మ గుడి, నంది మండపం, వీరభద్రస్వామి ఆలయం వరకు పుష్పపల్లకిలో గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది.. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.. శ్రీశైల క్షేత్రమంత శివనామస్మరణతో మారుమ్రోగింది. ఈ పూజ కైకర్యాలు, పుష్పపల్లకిసేవలో ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు, పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు..