NTV Telugu Site icon

Byreddy Siddharth Reddy vs Byreddy Shabari: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. బైరెడ్డి శబరి కౌంటర్‌ ఎటాక్‌..

Byreddy

Byreddy

Byreddy Siddharth Reddy vs Byreddy Shabari: ఉమ్మడి కర్నూలు జిల్లా పాలిటిక్స్‌ ఇప్పుడు బైరెడ్డి వర్సెస్‌ బైరెడ్డిగా మారుతున్నాయా అంటే.. అవును అనే విధంగానే ఆరోపణలు, విమర్శలు.. కౌంటర్లు, కౌంటర్‌ ఎటాక్‌లు నడుస్తున్నాయి.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత బైరెడ్డి సిధార్థ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆడదాం ఆంధ్ర పై విచారణకు అదేశించడంపై వ్యంగాస్త్రాలు సంధించారు. అయితే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. దీంతో.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్సెస్ బైరెడ్డి శబరిగా మారిపోయాయి నంద్యాల రాజకీయాలు..

Read Also: Skoda Octavia AWD: అధునాతన ఫీచర్లు, అత్యుత్తమ పనితీరుతో రాబోతున్న 2025 స్కోడా ఆక్టావియా

కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేవారు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి.. స్పోర్ట్స్ మినిస్టర్ అధికారికంగా అడుదాం ఆంధ్రాకి కేటాయించింది కేవలం రూ.199 కోట్లని చెప్పారు… కూటమి వారు ఒకడు 300 కోట్లు, మరొకడు 400 కోట్ల స్కాం చేశారు అంటారు… రూ.119 కోట్లలో 400 కోట్ల రూపాయల స్కాం ఎలాజరుగుతుంది..? అని నిలదీశారు.. కూటమి నాయకులు అసెంబ్లీకి మాములుగానే వెళ్తున్నారా..? ఏమైనా సేవించి వెళ్తున్నారా..? అంటూ విమర్శించారు.. ఎన్నిరోజులు పనికిమాలిన ఆరోపణలు చేస్తారు.. రూ.119 కోట్లు ఏవిధంగా ఖర్చుపెట్టామో కలెక్టర్ల అకౌంట్లకు, ప్రైజ్ మనీ , టీషట్ల రూపంలో ఎలా ఖర్చు పెట్టమో.. రికార్డులు వారి వద్దనే ఉన్నాయి కదా..? అని ప్రశ్నించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఏమిచేశారు..? భువనేశ్వరిని తిట్టినారని.. చంద్రబాబును అరెస్టు చేశారని.. పవన్ కల్యాణ్‌ను తిట్టారు అని ఏడ్చి ఓట్లు దండుకున్నారు.. మరి అమ్మఒడి పథకం ఏమైంది? అని అడిగితే వల్లభనేని వంశీ మా వాళ్లను తిట్టాడు.. అని ప్రచారం చేస్తారు. రైతులకు ఇవ్వాల్సిన 20 వేలు అడిగితే పోసాని పచ్చి బూతులు తిట్టినాడు అని ఒకడు అంటాడు. పథకాల గురించి అడిగితే సంబంధం లేకుండా కూటమి నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. రాసి పెట్టుకొండి నాలుగు సంవత్సరాలలో కూడా వాళ్ల బీద ఏడుపులు తప్ప ప్రజలకు చేసేది ఏమి లేదన్నారు.. టీడీపీ నాయకులు జనాల్లోకి వెళ్లి ఓట్లు అడిగితే చీపుర్లు, చెప్పులు.. రెడీగా ఉన్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..

Read Also: Kavitha: కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారు..

అయితే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఎంపీ బైరెడ్డి శబరి హాట్ కామెంట్స్ చేశారు.. స్క్రిప్ట్ ఇచ్చినది సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నారన్న ఆమె.. చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థ రెడ్డి ఇష్టమొచ్చి మాట్లాడుతున్నారు.. 9 నెలలు సిద్ధార్థ రెడ్డి ఎక్కడికి వెళ్లారు..? కార్యకర్తల గురించి మాట్లాడే హక్కు సిద్ధార్థ రెడ్డికి లేదన్నారు.. కేసుల గురించి బైరెడ్డి సిధార్థ రెడ్డి మాట్లాడతారా? నాపై కేసులు పెట్టినప్పుడు గుర్తు లేదా? ఫుల్ బాటిల్ వేయడం బాగా అలవాటైనట్టుంది.. జగన్ రావాలని అనుకుంటున్నారట.. కల్తీ మద్యం, డ్రగ్స్ , గంజాయి మళ్లీ రావాలని జగన్ రావాలనుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు.. అవినీతిని ప్రభుత్వం ఖచ్చితంగా బయటపెడుతుందని హెచ్చరించారు.. సిద్ధార్థ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారు.. సినిమాల్లో ట్రై చేసుకుంటే బెటర్‌ అని సలహా ఇచ్చారు.. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి బయటికి వస్తుంది.. శిక్ష తప్పదు అని వార్నింగ్‌ ఇచ్చారు.. స్కూలు పిల్లలకు కూడ డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చారు అని విమర్శించారు. సూపర్ సిక్స్ ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం.. డైవర్షన్ పాలిటిక్స్ అవసరం లేదు.. నా తల్లి కూడా మాట్లాడారు.. నేను మర్చిపోను.. జగన్ తల్లిని, చెల్లిని ఎలా చేశారో.. ఇక్కడా అదే చేస్తున్నారు.. మహిళలపై గౌరవం లేనివాళ్లు ఇలా చేస్తారు అంటూ దుయ్యబట్టారు ఎంపీ బైరెడ్డి శబరి.