Anganwadi Jobs: మహిళలకు శుభవార్త.. 108 అంగన్‌వాడీ జాబ్స్.. పరీక్ష లేకుండా ఎంపిక..!
- 108 పోస్టులు విడుదల
- 10వ తరగతి అర్హత
- పరీక్ష లేకుండా ఎంపిక
- ఏప్రిల్ 23 డెడ్‌లైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టు పరిధిలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 108 పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 7 మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు ఉండగా, మిగిలిన 101 పోస్టులు అంగన్‌వాడీ సహాయకురాలు (ఆయాలు) విభాగంలో ఉన్నాయి. కేవలం వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్న ఈ నోటిఫికేషన్, స్థానిక గ్రామాలు లేదా వార్డుల్లో ఉపాధి కోరుకునే వారికి ఒక మంచి అవకాశం.
Also Read
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్‌పై సజ్జల తీవ్ర విమర్శలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు విషయానికి వస్తే, జూలై 1, 2025 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ఎస్సీ , ఎస్టీ వర్గాల్లో 21 ఏళ్ల అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో, 18 ఏళ్లు నిండిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసే గ్రామ లేదా వార్డు పరిధిలోనే నివసిస్తూ ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, కేవలం విద్యార్హత , ఇతర నిబంధనల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
Digital Arrest Scam: బాపట్లలో రిటైర్డ్ టీచర్ డిజిటల్ అరెస్ట్.. రూ.60 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని నింపి, దానికి పదో తరగతి మార్కుల జాబితా, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాల జిరాక్స్ కాపీలపై సొంతంగా సంతకం (Self-attestation) చేసి జతపరచాలి. పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత సీడీపీఓ (CDPO) కార్యాలయంలో ఏప్రిల్ 23, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణించబడవు కాబట్టి అర్హులైన మహిళలు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!