Site icon NTV Telugu

Anganwadi Jobs: మహిళలకు శుభవార్త.. 108 అంగన్‌వాడీ జాబ్స్.. పరీక్ష లేకుండా ఎంపిక..!

Anganwadi

Anganwadi

నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టు పరిధిలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 108 పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 7 మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు ఉండగా, మిగిలిన 101 పోస్టులు అంగన్‌వాడీ సహాయకురాలు (ఆయాలు) విభాగంలో ఉన్నాయి. కేవలం వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్న ఈ నోటిఫికేషన్, స్థానిక గ్రామాలు లేదా వార్డుల్లో ఉపాధి కోరుకునే వారికి ఒక మంచి అవకాశం.

QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు విషయానికి వస్తే, జూలై 1, 2025 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ఎస్సీ , ఎస్టీ వర్గాల్లో 21 ఏళ్ల అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో, 18 ఏళ్లు నిండిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసే గ్రామ లేదా వార్డు పరిధిలోనే నివసిస్తూ ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, కేవలం విద్యార్హత , ఇతర నిబంధనల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Digital Arrest Scam: బాపట్లలో రిటైర్డ్ టీచర్‌ డిజిటల్‌ అరెస్ట్.. రూ.60 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..

ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని నింపి, దానికి పదో తరగతి మార్కుల జాబితా, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాల జిరాక్స్ కాపీలపై సొంతంగా సంతకం (Self-attestation) చేసి జతపరచాలి. పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత సీడీపీఓ (CDPO) కార్యాలయంలో ఏప్రిల్ 23, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణించబడవు కాబట్టి అర్హులైన మహిళలు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Exit mobile version