NTV Telugu Site icon

Nandamuri Taraka Ratna: లోకేష్‌ యాత్రలో తారకరత్నకు తీవ్ర అస్వస్థత

Nandamuri Taraka Ratna

Nandamuri Taraka Ratna

Nandamuri Taraka Ratna: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యాత్రలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు సినీ నటుడు నందమూరి తారకరత్న.. లోకేష్‌ యాత్రలో ఆయన స్పృహతప్పి పడిపోయారు.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కుప్పంలోని కేసీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఆస్పత్రికి వెళ్లిన హీరో బాలకృష్ణ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.. మరోవైపు కేసీ మెడికల్‌ ఆస్పత్రి నుంచి కుప్పం పీఎస్‌ మెడికల్‌ కాలేజీకి రిపర్‌ చేశారు వైద్యులు.. ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు..

Read Also: TTD Mobile App: టీటీడీకి కొత్త యాప్‌.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సేవలు

లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. కొద్దిసేపు నడిచిన తర్వాత స్పృహతప్పి పడిపోయినట్టు చెబుతున్నారు.. వెంటనే అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టిన పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైంది.. ముందుగా వరదరాజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్‌.. ఆపై హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ శ్రేణులు కుప్పంకు తరలివచ్చాయి.. టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ కూడా లోకేష్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.

Show comments