Site icon NTV Telugu

Balakrishna: నారావారిపల్లెలో ఉదయాన్నే జాగింగ్ చేసిన బాలయ్య

Balakrishna

Balakrishna

Balakrishna: చిత్తూరు జిల్లా నారావారి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మూడేళ్ల అనంతరం నారావారి ఇంట‌ సంక్రాంతి వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్‌లతో సహా నారా కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. ఈ సందర్భంగా మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే పాడిరైతులతో కలిసి దేవాన్ష్ పాలు పితుకుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా భోగీ పండగ రోజు ఉదయాన్నే హీరో బాలయ్య నారావారిపల్లెలో జాగింగ్ చేశారు.

Read Also: Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ తమను ఎంతో ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరూ సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. అటు వీరసింహారెడ్డి సూపర్‌ సక్సెస్‌తో బాలయ్య ఊపు మీద కనిపిస్తున్నారు. దీంతో నారావారిపల్లెలో ఆయన పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటు బావా బావమరుదులు, అటు మనవడు దేవాన్ష్ రాకతో నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి, నారా కుటుంబీకులు భోగి మంటలతో వేడుకలను ఆరంభించారు.

Exit mobile version