NTV Telugu Site icon

Nallapareddy Prasanna kumar Reddy: వైసీపీకి గుడ్‌బై ప్రచారం.. స్పందించిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి

Nallapareddy Prasanna Kumar

Nallapareddy Prasanna Kumar

Nallapareddy Prasanna kumar Reddy: నెల్లూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది.. ఇక, ఈ మధ్య నెల్లూరు జిల్లాకు చెందిన మరో రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.. తెలిసినవారు, తెలియనివారు ఈ వార్త షేర్‌ చేశారు.. చేస్తూనే ఉన్నారు. అయితే, ఆ ప్రచారంపై ఘాటుగా స్పందించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం సరికాదన్న ఆయన.. మాది రాజకీయ కుటుంబం.. నా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. మంత్రిగా పనిచేశా.. సీఎం వైఎస్‌ జగన్‌ నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారు.. అసలు నేను పార్టీ మారడం ఏంటి? అని ప్రశ్నించారు.

Read Also: Women’s reseravation bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ.. బీఆర్ఎస్ ఏంపీల వాయిదా తీర్మానం

2012లో ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి గెలిచా.. నా చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్‌ జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు నల్లపరెడ్డి… వాళ్ల ఇంట్లో బిడ్డలా చూసుకుంటున్నారు.. నెల్లూరు బ్యారేజ్ కు మా నాన్న శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారు అని గుర్తుచేశారు. కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని ద్రోహం చేశారని మండిపడ్డ ఆయన.. ఈ గేమ్ చంద్రబాబు ఆడుతున్నాడు.. గతంలో ఆయన సీఎం అయ్యేటప్పుడు కూడా ఇదే గేమ్ ఆడాడని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని ఇలా చేస్తూన్నాడు అని చంద్రబాబుపై ఫైర్‌ అయిన ఆయన.. కోవూరులో వేరొకరికి టికెట్ ఇస్తానని జగన్ చెప్పినా నేను సిద్ధం.. ఆయన పెట్టే ఏ అభ్యర్థినైనా గెలిపిస్తానని ప్రకటించారు.. అంతే కాదు.. నేను చనిపోయే వరకూ జగన్ తోనే ఉంటాను అని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం సాగుతుండడంతో.. నాకు ఎందరో ఫోన్ చేశారు.. జగన్‌ మళ్లీ సీఎం అయ్యేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రకటించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. కాగా, నెల్లూరు వైసీపీలో పడనున్న మరో వికెట్‌.. జగన్‌పై అసంతృప్తితో రగిలిపోతున్న మరో పెద్దారెడ్డి అంటూ.. ఓ వార్త హల్‌చల్‌ చేసిన విషయం విదితమే.

Show comments