NTV Telugu Site icon

Nagababu : బతికినంత కాలం పవన్ ఫాలోవర్ గా ఉంటాః నాగబాబు

Nagababu

Nagababu

Nagababu : తాన బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ ఫాలోవర్ గానే ఉంటానని మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు చెప్పారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడారు. మన హిందూ ప్రజలకు 12వ ఏడాది చాలా స్పెషల్ అని నాగబాబు చెప్పుకొచ్చారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయని.. ఈ 12వ ఆవిర్భావ సభ కూడా జనసేనకు పుష్కరాల్లాంటిదేనన్నారు. ఈ సభ గతంలో జరిగిన చాలా సభలకంటే చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వైసీపీపై సెటైర్లు వేశారు.

Read Also : Janasena: పదేళ్ల తర్వాత “జనసేన”కు100% స్ట్రయిక్ రేట్.. పార్టీ 11ఏళ్ల ప్రస్తానం ఇదే..

ఎన్నికలకు ముందు మాజీ సీఎం జగన్ నిద్రలోకి వెళ్లిపోయారని.. ఇంకా ఆ నిద్ర నుంచి బయటకు రాలేదని చెప్పారు. అప్పుడప్పుడు ఆయన మాటలు చూస్తే నిద్రలో కలవరిస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి జగన్ ఇంకో 20 ఏళ్లు నువ్వు పడుకో.. మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అంటూ సెటైర్లు వేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై కూడా మాట్లాడారు. పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు జనసేన కార్యకర్తలు, ప్రజలు కీలకంగా పనిచేశారన్నారు. అంతే తప్ప ఎవరో ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదన్నారు. అలా తన వల్లే పవన్ గెలిచాడు అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్‌ చాలా గొప్ప వ్యక్తి అని నాగబాబు ప్రశంసించారు. ‘అతను చాలా ఎత్తుకు ఎదిగాడని.. వీలైతే పవన్ కల్యాణ్‌ స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలి. లేదంటే అంత గొప్ప వ్యక్తికి సేవకుడిగా ఉండాలి. నేను పవన్ అంత ఎత్తుకు ఎదగలేను. అందుకే సేవకుడిగా ఉండిపోయాను’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.