Nagababu : తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్ ఫాలోవర్ గానే ఉంటానని మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు చెప్పారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడారు. మన హిందూ ప్రజలకు 12వ ఏడాది చాలా స్పెషల్ అని నాగబాబు చెప్పుకొచ్చారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయని.. ఈ 12వ ఆవిర్భావ సభ కూడా జనసేనకు పుష్కరాల్లాంటిదేనన్నారు. ఈ సభ గతంలో జరిగిన చాలా సభలకంటే చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చారు.…