Site icon NTV Telugu

Nadendla Manohar: టీడీపీ- జనసేన కలయిక రాజకీయ లబ్ధి కోసం కాదు..

Nadendla

Nadendla

TDP- Janasena: పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన PAC ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. టీడీపీ- జనసేన కలయిక రాజకీయ లబ్ది కోసం కాదు.. భావి తరాల అభివృద్ధి కోసం అని పేర్కొన్నారు. జగన్ పరిపాలనపై విసిగిపోయిన ప్రజల గళాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వినిపిస్తారు.. పేదలకు పెత్తందార్లకు యుద్ధం అంటున్న సీఎం ఎందుకు ప్రజల సొమ్ముతో రెండు హెలికాప్టర్ లు పెట్టుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. ఏ కారణంతో డబ్బులు వృదా చేస్తున్నారు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి పక్షాలను విమర్శించడానికి ఉపయోగించుకున్నారు అని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.

Read Also: Antony: ఆహాలో జోజు జార్జ్ ‘ఆంటోని’ స్ట్రీమింగ్

ఇక, 45 రోజుల్లో దిగిపోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాధనం వృదా చేస్తున్నారు అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ అని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు కలిసి నిర్వహించుకుంటున్న సభా వేదికపై అన్ని నియోజక వర్గాలకు చెందిన 500 మంది అతిథులు పాల్గొంటున్నారు.. తాడేపల్లిగూడెంలో జరగనున్న టీడీపీ- జనసేన బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చారు. తొలిసారి జరగబోతున్న సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు హాజరు అవుతారు అని నాదేండ్ల మనోహర్ చెప్పారు.

Read Also: Karimnagar Cylinder Blast: కరీంనగర్ లో భారీ పేలుడు.. వీడియో ఇదిగో..

కేవలం ప్రధాని రక్షణ కోసం మాత్రమే రెండు హెలికాప్టర్లను ఉపయోగించాలని చట్టం ఉంది.. దీనిపై చట్టపరంగా పోరాడుతామని నాదేండ్ల మనోహర్ తెలిపారు. జనసేన NDA లో భాగం.. అభివృద్ధి కావాలంటే కేంద్రం సహకారం అవసరం.. బీజేపీతో కలిసి వెళ్ళే విధంగా ఇంకా చర్చలు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన అధ్యక్షుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.

Exit mobile version