NTV Telugu Site icon

Nadendla Manohar: బటన్ నొక్కడాన్నే పాలన అనుకుంటున్నారు.. అభివృద్ధి ఎక్కడ?

Nadendla Manohar On Ap Govt

Nadendla Manohar On Ap Govt

Nadendla Manohar Fires On AP Govt In Yuvashakti Sabha: శ్రీకాకుళంలో నిర్వహించిన యువశక్తి సభలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బటన్ నొక్కడాన్నే పాలన అనుకుంటున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. హక్కుల గురించి మాట్లాడేవాడిని పోలీసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తిత్లీ తుఫాన్ భాదితులకి ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అని నిలదీశారు. ఉద్దానం కిడ్నీ సమష్యను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది పవన్ కళ్యాణేనని పేర్కొన్నారు. కిడ్నీ రోగులకు డయాలసిస్ కోసం ప్రతీ పిహెచ్‌సిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, మరి వాటిని ఎందుకు పెట్టలేదని అడిగారు. రాష్ర్టంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని, ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారని పేర్కొన్నారు.

Virat Kohli: వన్డే క్రికెట్ చరిత్రలో కోహ్లీ సంచలన రికార్డ్.. 37కి 37

ఒక్కోసారి ఉత్తరాంధ్రకు‌ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని‌ అంటారు.. మరోసారి విశాఖనే రాజధాని అని పేర్కొంటారు.. ఓ మంత్రి ఏకంగా ప్రత్యేక రాష్ర్టం అడుగుతామంటాడు.. ఈ వెనుకబాటుకు కారణం ఎవరు? అని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత కోసం భరోసా కల్పించేందుకు జనసేన నిలబడుతుందని హామీ ఇచ్చారు. పెట్రోల్ ధర రాష్ట్రంలో అత్యధిక రేటు ఉందని, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. 12000 మందికి విజయనగరం గుంకలాంలో ఇల్లు కడతామని చెప్పి, కనీసం వంద ఇల్లు కట్టలేదన్నారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎనిమిది వేల మంది ముందుకొచ్చారని.. యువనాయకత్వం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మత్స్యకార భరోసా పచ్చి మోసమని, వైసీపీ జెండా మోసిన వారికే ఆ పథకం ఇస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. జాబ్ క్యాలెండర్‌ అన్నారు.. మరీ డీఎస్సీ నోటిపికేషన్ ఏది.. ఎందుకు ఈ మోసం? అని కడిగిపారేశారు.

Plane Door Open : గాల్లో ఉండగా తెరుచుకున్న విమానం డోర్..

ఉత్తరాంధ్ర వాసులు నిజాయితీ కలిగిన వ్యక్తులని, సమాజం కోసం యువత నిలబడాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. జగన్‌లాంటి నియంత‌ గతంలో ముఖ్యమంత్రి కాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేనికైనా సిద్ధంగా ఉండాలని, హక్కుల కోసం పోరాడాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో అక్రమ కేసుల పెడితే.. పొరాడేందుకు తాము న్యాయసహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. యువత భవిత కోసం, ఉత్తరాంధ్ర ప్రజల కోసం భరోసా తీర్మానం అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి యువత ఉపాధి కోసం కాదు.. విద్య, వైద్యం కోసం వలస వెళ్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఉత్తరాంద్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర డెవలప్‌మెంట్ బోర్డ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Jayasudha: 64 ఏళ్ల వయస్సులో మూడో పెళ్లి చేసుకున్న జయసుధ.. ?