NTV Telugu Site icon

MVV Satyanarayana: మూడు గంటల్లోనే కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేధించారు.. నా ఫ్యామిలీ క్షేమం

Mvv Satyanarayana Kidnap Ca

Mvv Satyanarayana Kidnap Ca

MVV Satyanarayana Talks About His Family And Friend Kidnap: తన ఫ్యామిలీ, స్నేహితుడు కిడ్నాప్‌కు గురైన వ్యవహారంపై తాజాగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం తన కుటుంబం, స్నేహితుడు సేఫ్‌గా ఉన్నారని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే ఈ కేసుని పోలీసులు ఛేధించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కిడ్నాపర్ హేమంత్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని, తన వద్ద అతనెప్పుడూ పని చేయలేదని, కేవలం డబ్బు కోసమే అతడు ఈ కిడ్నాప్‌కి పాల్పడ్డాడని క్లారిటీ ఇచ్చారు.

CM YS Jagan: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు

మూడు రోజుల క్రితం హేమంత్ అనే కిడ్నాపర్ ఋషికొండలో తన కుమారుడు ఉంటున్న ఇంట్లోకి చొరబడి, అతడ్ని నిర్బంధించాడని ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. అనంతరం తన కొడుకుతో ఫోన్ చేయించి, ఒంట్లో బాగోలేదని చెప్పి, తన భార్యను ఆ కిడ్నాపర్ ఇంటికి రప్పించాడని.. తన భార్య ఇంటికి చేరుకోగానే ఆమెని కూడా నిర్బంధించాడని చెప్పారు. ఆ తర్వాత తన భార్య, కొడుకు చేత తన స్నేహితుడు గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)ని సైతం ఇంటికి పిలిపించి.. అతడ్ని కూడా కిడ్నాప్ చేశాడని పేర్కొన్నారు. వీరి ముగ్గురిని చిత్రహింసలకు గురి చేస్తూ.. ఆ కిడ్నాప్ డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. ఈ కిడ్నాప్ జరిగినప్పుడు తాను హైదరాబాద్‌లో ఉన్నానన్నారు.

Asia Cup 2023: పాక్‌లో నాలుగు, మిగిలినవన్నీ శ్రీలంకలోనే.. ఆసియా కప్‌ షెడ్యూల్‌ ఇదే..

బుధవారం ఉదయం తాను జీవీతో ఫోన్‌లో మాట్లాడానని, తర్వాత మాట్లాడుతానంటూ జీవీ వెంటనే ఫోన్ కట్ చేశారని ఎంవీవీ చెప్పారు. తాను తిరిగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. చివరగా ఓసారి లిఫ్ట్ చేసి.. శ్రీకాకుళంలో ఇన్‌కమ్ టాక్స్ రైడ్స్ అవుతున్నాయని చెప్పి, ఫోన్ పెట్టేశారన్నారు. ఈరోజు ఉదయం ఫోన్ చేస్తే, లిఫ్ట్ చేయలేదని.. తనకు అనుమానం వచ్చి పోలీస్ కమీషనర్‌కి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. జీవీ నంబర్ ట్రాక్ చేయమని తాను కోరానని.. ఋషికొండలోనే లొకేషన్ చూపించిందని, దీంతో తమకు అనుమానం వచ్చిందని చెప్పుకొచ్చారు. కిడ్నాపర్ హేమంతే.. తన కుటుంబ సభ్యుల్ని బెదిరించి, ఫోన్ చేయించాడని ఎంవీవీ చెప్పారు.

Pawan Kalyan: వారి తిట్లకు చేతలతో సమాధానం చెప్తా.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

తన మీద పగ, ప్రతీకారంతో అతడు ఈ కిడ్నాప్ చేయలేదని, కేవలం డబ్బు కోసమే చేశాడన్నారు. అసలు హేమంత్‌తో తనకెలాంటి పరిచయం లేదన్నారు. హేమంత్‌పై గతంలోనూ కిడ్నాప్ కేసులతో పాటు ఓ మర్డర్ కేసు కూడా ఉందన్నారు. రియల్ ఎస్టేట్‌లో ఉన్న తన శతృవులు ఈ పని చేయించి ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. ఎందుకంటే, తనకు ఎవరితోనూ గొడవలు లేవన్నారు. హేమంత్ ఇంత డబ్బు కావాలని డిమాండ్ కూడా చేయలేదన్నారు. తన కొడుకుని 48 గంటలపాటు, భార్యకు 24 గంటలపాటు బంధించారన్నారు. తన కోడలు ఊరెళ్లడంతో సేఫ్ అయ్యిందని, లేకపోతే ఆమెని కూడా హింసించే వాళ్లన్నారు.

Show comments