NTV Telugu Site icon

MVV Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు, బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు

Satyanarayana On Brs

Satyanarayana On Brs

MVV Satyanarayana Reacts On BRS Comments Over Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ఒత్తిళ్ల వల్ల కేంద్రం వెనక్కి తగ్గి ఉంటుందనేది కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి కులస్తేతో సమావేశం అయిన తర్వాత ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలను గట్టిగా చెబుతామన్నారు. ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేశామని, పార్లమెంట్‌లో గళం విప్పామని తెలియజేశారు. ఇప్పుడు ప్రైవేటీకరణ విషయంపై కేంద్రం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోందన్న ఆయన.. ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి రద్దు చేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఉక్కు ప్రైవేటీకరణ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.

GT vs PBKS: ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.. 153 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్ బౌలర్లు

తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌కు రావడం వ్యాపార సంబంధమైన విషయమని ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు, బీఆర్ఎస్‌కు సంబంధం లేదన్న ఆయన.. అంత ప్రేమే ఉంటే తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు గళం విప్పలేదని ప్రశ్నించారు. రెండు రోజుల ప్రచార ఆర్భాటానికే కేంద్రం దిగి వచ్చేస్తుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీది కేవలం రాజకీయ ఆరాటం మాత్రమేనని.. దేశమంతటా పోటీ చేయాలని ఉత్సాహంలో ఉందని విమర్శించారు. రాజకీయ ప్రచారం కోసం చేసే ప్రయత్నాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాటం ఉదృతం చేస్తామన్న ఆయన.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కార్మిక సంఘాలతో కలుపుకుని వెళతామన్నారు. ఎన్నికల ఏడాది కావడంతో.. ప్రజల మనో భావాలను గుర్తించి బీజేపీ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

CM Jagan Mohan Reddy: గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్ష.. వాటిని తిప్పికొట్టాలంటూ సూచన

Show comments