Site icon NTV Telugu

Mudragada: సీఎం జగన్‌కు మరోసారి ముద్రగడ పద్మనాభం లేఖ.. ఏం రాశారంటే..?

Mudragada Padmabham

Mudragada Padmabham

Mudragada Padmanabham: సీఎం జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖ రాశారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు రిజర్వేషన్లు పోరాటానికి ముగింపు పలికే దిశగా అడుగులు ఉండాలని సూచించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల వారు వారిని ఉపయోగించుకున్నారని.. అందరిలా జగన్ ఉండకూడదని ముద్రగడ పద్మనాభం ఆకాంక్షించారు. అసెంబ్లీలో వీరి కోరిక సమంజసం, న్యాయం అని మీరు అన్నారని విన్నానని.. కాపు నాయకుల కన్నా జగన్ చాలా మంచిగా మద్దతిస్తూ మాట్లాడారని చెప్పుకున్నారని ముద్రగడ ప్రస్తావించారు. రిజర్వేషన్ విషయంలో బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు తన లేఖలో ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే వారు జీవితాంతం జగన్‌కు రుణపడి ఉంటారని ముద్రగడ తన లేఖలో వివరించారు.

Read Also: AppalaRaju: పవన్ కళ్యాణ్ పగటి వేషగాడు.. చంద్రబాబుకు పూర్తిగా అమ్ముడుపోయాడు

Exit mobile version