NTV Telugu Site icon

సీఎం జ‌గ‌న్‌కు ముద్ర‌గ‌డ లేఖ‌.. ఆ అధికారం మీకు ఎక్క‌డిది..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి మ‌రో లేఖ రాశారు కాపు ఉధ్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఇప్ప‌టికే ప‌లు అంశాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సీఎంకు లేఖ‌లు రాస్తూ వ‌స్తున్న ఆయ‌న‌.. ఈ సారి ఓటీఎస్ విధానాన్ని త‌న లేఖ‌లో పేర్కొన్నారు.. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దని, గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని త‌న లేఖ‌లో సీఎంను కోరారు ముద్రగడ.. ఇక‌, గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు… గత ప్రభుత్వాలు పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం ఎక్కడిది అంటూ త‌న‌ లేఖలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను నిలదీశారు ముద్ర‌గ‌డ్డ ప‌ద్మ‌నాభం. కాగా, ఏపీ స‌ర్కార్ తీసుకొచ్చిన ఓటీఎస్ విధానంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే కాగా.. శుక్ర‌వారం సీఎం వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ప‌లు కీల‌క స‌వ‌ర‌ణ‌ల‌కు ఆమోదం ల‌భించిన విష‌యం తెలిసిందే.

Read Also: వీకెండ్ లాక్‌డౌన్ ఎత్తివేత.. ఇక‌, య‌థావిథిగా స్కూళ్లు..!