ఈమధ్యకాలంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం యాక్టివ్ అవుతున్నారు. సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఈ డబ్ల్యూ ఎస్ పై ఇచ్చిన తీర్పు, రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం పై దృష్టి పెట్టాలని కోరారు. రిజర్వేషన్లపై పరిశీలన చేయాలని లేఖలో కోరారు ముద్రగడ. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరారు ముద్రగడ. 2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాలలో కాపు జాతి మీ గెలుపుకు కృషి చేశారని లేఖలో పేర్కొన్నారు.
కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుంది. మిగతా కులాలు వారిలాగే కాపు జాతికి వెలుగులు చూపించాలి. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ల ను ప్రజలు దేవుళ్ళు లా భావించారు, పేద వర్గాలకు మంచి చేసి మీరు ప్రేమించబడడానికి పునాదులు వేసుకోవాలి. రిజర్వేషన్లు కల్పించుటకు ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలి. నా జాతి కోసం తపన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు లేదన్నారు ముద్రగడ పద్మనాభం.
ముద్రగడ లేఖ పూర్తిపాఠం
తమరికి గతంలో కూడా నా (బలిజ, కాపు, తెలగ, ఒంటరి) జాతి పొగొట్టుకున్న రిజర్వేషన్ విషయమైన లేఖ రాసానండి. మరలా ఈ రోజు వ్రాయడానికి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు EWS పై ఇచ్చిన 26-12-2022 శ్రీ జగన్మోహనరెడ్డి గారు. ముఖ్యమంత్రి వర్యులు విజయవాడ/అమరావతి. ముద్రగడ పద్మనాభం సమస్కారములు. తీర్పు రాజ్యసభలో MP GVL నరసింహారావు గారు అడిగిన ప్రశ్నకి Constitution 103, 105 Amendment Act. 2019 & 2021 అనుసరించి Article 342A (3) ప్రకారం రిజర్వేషను రాష్ట్రంలో అమలుచేసుకోవచ్చు. అని సోషల్ జస్టిస్ మంత్రి SUSHRI PRATIMA BHOUMIK గారు 21-12-2022న సమాధానం ఇచ్చారండి. పై విషయాలు పరిశీలించి రిజర్వేషన్ ఇవ్వడానికి దృష్టి పెట్టవలసినదిగా కోరుకుంటున్నానండి.
నేను అడిగింది ఎవరి కోటాలోను వాటా పెట్టమని అడగడం లేదండి. అందరూ అనుభవించగా మిగిలిన దానిలోనే ఇప్పించండి. అడిగిన ప్ర 13) ప్రకా UMIK గారి క్రిష్టి పెట్టవల పెట్టమని జ కవర్గాలలో మాసుకుంటే లా కోసం ఎన్నో 2019 అసెంబ్లీ ఎన్నికలలో కొద్దిపాటి నియోజకవర్గాలలో తప్ప మిగిలిన అన్ని చోట్ల మా కాపుజాతి కి అటువంటి వారందరూ మీ గెలుపుకు ఉపయోగపడినారండి. మీరు మా కాపుజాతికి రిజర్వేషను కల్పించి మరొక సారి మా కాపు జాతి మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నానండి. తమరు ఎన్నో కులాల వారికి వారి అభివృద్ధి కోసం ఎన్నో పధకాలు దానం చేస్తూ వారి జీవితాలలో భిక్ష పెట్టిన ప్రజల లేకుండా సహ పని కోసం నిత్య కు మంచి చేసి మీరు ఆలోచన చేసి మా ముద్రగడ వెలుగు చూస్తావున్నారండి. అలాగే మాకాపు జాతి వారికి అటువంటి వెలుగు చూపించమని కోరుచున్నానండి. నేను పుట్టిన ఊరి కోసం, నాకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రజల కోసం, ఆఖరిగా నేను పుట్టిన కులం కోసం, అవకాశం ఉన్నంత వరకు ఇతరులకు నష్టం లేకుండా సహాయపడాలనే తపన తప్ప మిమ్మలను ఇబ్బంది పెట్టాలనే అలోచన కాదండి. తలపెట్టిన పని కోసం నిత్యం తాపత్రయపడే వాడిని నేనండి. కీ॥శే॥ గౌరవ శ్రీ ఎన్.టి.రామారావు గారిని, మీ తండ్రి కీ॥శే॥ గౌరవ శ్రీ వై.యస్. రాజశేఖరరెడ్డి గారిని ప్రజలు దేవుడులాగ భావించారండి. పేద వర్గాలకు మంచి చేసి మీరు కూడా ప్రజలచే ప్రేమించబడడానికి పునాదులు వేసుకోమని కోరుచున్నానండి. దయచేసి మనస్సు పెట్టి రిజర్వేషను కల్పించుటకు ఆలోచన చేసి మా పేద కాపులకు న్యాయం చేయమని తమరిని కోరుచున్నానండి.
ఇట్లు ముద్రగడ పద్మనాభం.
Read Also:Indonesia: ఇండోనేషియాలో విపత్తు.. నేటితో ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..