కడప జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి: విజయసాయిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శీతకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యా సభలో జీరో అవర్‌లో కడప జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. టెక్స్‌టైల్ పార్క్ ఆవశ్యకతను వివరించారు. కొప్పర్తిలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 4,445 కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా ఏడు “మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్”, “అప్పరెల్ పార్కు” (మిత్రా) చేయాలని నిర్ణయించిందని దీన్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లాలోని కొప్పర్తిలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన “మిత్రా” పార్కు ద్వారా స్పిన్నింగ్, డైయింగ్, ప్రింటింగ్ వంటి ప్రక్రియలు ఒకే చోట చేపట్టే వీలుందన్నారు. దీని ద్వారా టెక్స్‌టైల్ వాల్యూ చైన్ యావత్తు ఒకే చోట సమీకృతమై ఉంటుందని సభలో పేర్కొన్నారు. “మిత్రా” పార్కులలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన అవకాశం ఉందన్నారు.
also read:సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలి: వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఫలితంగా రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఈ పార్కులు ఏర్పాటు వల్ల దేశియంగా, అంతర్జాతీయంగా టెక్స్‌టైల్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలోకి కొప్పర్తిలో ఇప్పటికే అనేక టెక్స్‌టైల్ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం “మెగా ఇండస్ట్రియల్ హబ్”ను ఏర్పాటు చేసిందని సభకు వివరించారు. మిత్రా పార్కు అభివృద్ధికి అవసరమైన రోడ్డు, రవాణా వంటి మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాంతం పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలను ప్రకటించి ఈ ప్రాంతాన్ని పెట్టుబడిదారుల అనుకూల ప్రాంతంగా ప్రోత్సాహిస్తోందన్నారు. దేశంలో కాటన్, సిల్క్ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది నిపుణులైన హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్ కార్మికులు ఉన్నారని తెలిపారు. “మిత్రా” పార్క్ ద్వారా రాష్ట్రం మొత్తానికి ఏకైక నోడల్ పాయింట్‌గా అభివృద్ధి చెంది, సరఫరా సమీకృతం కావడానికి దోహదపడుతుందని సభలో విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!