NTV Telugu Site icon

Vijaysai Reddy On Bonda Uma: బోండా ఉమాపై విజయసాయి ట్వీట్ వార్

Bondauma

Bondauma

ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ (Tdp Vs Ysrcp) నేతలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు హాట్ కామెంట్స్ చేసుకుంటూ వుంటారు. తాజాగా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి (VijaySaireddy) టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుపై మండిపడ్డారు. ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

Read Also:Harbhajan Singh: టీ20 కోచ్‌గా ఆ మాజీ ఆటగాడు బాగా సరిపోతాడు..

బోండా ఉమ పై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఒరేయ్ బొండాం! ఏదైనా పంచాల్సి వచ్చినప్పుడు తన వాళ్లను మాత్రమే ఎంపిక చేస్తాడు బొల్లి బాబు. ఎవరి కళ్లల్లో అయినా కారంపొడి కొట్టాలంటే బోండాంలాంటి రౌడీలను సెలెక్ట్ చేస్తాడు.

జేబుదొంగ శిష్యుడు సైకిల్ బెల్లుల దొంగ. స్క్రిప్టు అందితే గుడ్డిగా చదివేస్తాడు. నమ్మశక్యంగా ఉందో లేదో చూడడు. బొండాం! నీ యజమాని చంద్రం, బంధువర్గం లక్షల కోట్లు దాచిన బంకర్లన్నీ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయి. పేదలకు పంచిన 170 ఎకరాల అసైన్డ్ భూముల్లో పాతాళ గృహాలు కట్టాడంట డ్రామోజి. పట్టాలిచ్చి 15 ఏళ్లయినా ఆ భూములను వదలకుండా కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకునేది అందుకే అంటూ విరుచుకుపడ్డారు విజయసాయి.