NTV Telugu Site icon

Vijay Sai Reddy: కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తో విజయసాయి భేటీ

Collage Maker 14 Feb 2023 04.08 Pm

Collage Maker 14 Feb 2023 04.08 Pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ ను రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి న్యూఢిల్లీ లో ఆయన స్వగృహంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. న్యాయ వ్యవస్థలో ఆయనకున్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు కలగజేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఇప్పటివరకూ సేవలందించిన బిశ్వభూషణ్‌ హరిచందన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అపార అనుభవం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి ఎంతో మేలు కలగజేస్తుందని విజయ సాయిరెడ్డి అన్నారు. సోమవారం గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి∙దంపతులు భేటీ అయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని రాజ్‌భవన్‌లో తన సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం జగన్. ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా బిశ్వభూషన్‌ హరిచందన్‌ బదిలీ కావడంతో ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్ల పాటు సేవలందించి బదిలీపై వెళ్తున్న బిశ్వభూషన్‌ హరిచందన్‌కు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అనేక అంశాల్లో తనకు సలహాలు, మార్గదర్శకత్వం వహించారన్నారు సీఎం.

Read Also: WPL 2023: వేలం అద్భుతంగా నిర్వహించింది: మల్లికా సాగర్‌పై ప్రశంసలు