మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని భీమవరంలో ఏర్పాటు చేసి 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నేడు ప్రధాని మోడీ ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొంటానంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే ఆయన ఆదివారం రాత్రి ఏపీకి పయనమయ్యారు. కానీ ఏపీకి చేరుకోకముందే ఆయన రైలు దిగి తిరుగు ప్రయాణమయ్యారు. ఎందుకంటే.. శనివారం నాడు ఆయనకు మద్దతుగా భీమవరంలో యువకులు ర్యాలీ నిర్వహించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆ యువకుల తల్లిదండ్రులు ఎంపీ రఘురామరాజుకు ఫోన్ చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన రఘురామ భీమవరంకు చేరుకోకుండానే రైలు దిగి తిరిగి వెళ్లిపోయినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇదిలా ఉంటే.. నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం భాగ్యనగరానికి చేరుకున్న మోడీ.. రెండు రోజుల కార్యవర్గ సమావేశాల అనంతరం నిన్న సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.