వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఏదో ఓ అంశంతో నిత్యం వార్తల్లో ఉంటారు.. ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు.. పథకాలపై వివాదాస్పద వ్యాఖ్యలతో కేసులపాటైన ఆయన.. అరెస్ట్, జైలు, ఆస్పత్రి, హైకోర్టు, సుప్రీంకోర్టు, లోక్‌సభ స్పీకర్ చివరకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంల వరకు వెళ్లింది వ్యవహారం.. ఇక, వరుసగా సీఎం జగన్‌కు లేఖలు రాసే ఎంపీ రఘురామ.. తాజాగా మరో లేఖను రాశారు.. ఈ సారి పార్టీ ఎంపీ విజయస్థాయి రెడ్డిని అదుపులో పెట్టాలంటూ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకొంటున్నారని ఆయనను వెంటనే అదుపు చేయాలని లేఖలో సీఎం వైఎస్ జగన్‌ను కోరారు రఘురామ.. ఎంపీ విజయసాయిరెడ్డి తీరుతో పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని రాసుకొచ్చిన ఆయన.. అశోక్‌గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు అని హితవుపలికారు… మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు సైతం ఇచ్చింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి అశోక్‌గజపతిరాజుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వెంటనే అదుపులో పెట్టాలని లేఖలో సీఎంకు విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ.. విషయం ఏంటంటే..?
Raghu Rama Krishnam Raju