కేంద్రంలో ప్రత్యేకంగా బీసీలకోసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్.కృష్ణయ్య. విజయవాడలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ముందు పలు డిమాండ్లు ఉంచారు. కేంద్రం బీసీల కోసం ప్రత్యేకంగా రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. మత్స్యకారులు, వడ్డెర, యాదవ వంటి బీసీ కులాలకు కేంద్రప్రభుత్వం ఆర్థికంగా మరింత చేయూతనివ్వాలి..కాలక్రమేణా యాంత్రికరణతో కులవృత్తులన్నీ మరుగున పడ్డాయి..మరుగున పడ్డ కుల వృత్తులకు ప్రత్యామ్నాయంగా ఇతర పనులు చూపాలని ఆయన అన్నారు.
Read Also:Prakash Ambedkar : దేశంలో కొత్త నడవడికను సీఎం కేసీఆర్ మొదలుపెట్టారు
60శాతం మ్యాపింగ్ గ్రాంట్ ఇవ్వాలి..బీసీలను పైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలి..75 సంవత్సరాల తర్వాత కూడా బీసీల వాటా బీసీలకు ఎందుకు ఇవ్వరు..అన్ని రాష్ట్రాల్లోని బీసీలను ఏకం చేస్తాం..4లక్షలమందితో పార్లమెంట్ ను ముట్టడిస్తాం..
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. వైసీపీకి సేవ చేయకపోయినా బీసీల కోసం పోరాడుతున్నందుకు నాకు సీఎం జగన్ నాకు ఎంపీ పదవి ఇచ్చారు..దేశంలో 65శాతం పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే. మంత్రివర్గంలోనూ బీసీలకు పెద్దపీట వేసారు..
సీఎం జగన్ సంఘ సంస్కర్త..ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సాలో అమలు చేయాలని పోరాటం చేస్తాం. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పధకాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రావాలి..పార్లమెంట్ లో బీసీల బిల్లుకోసం చేసే పోరాటంలో అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి..బీసీల కులగణన చేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉంది..గుడివాడలో బీసీ బహిరంగ సభ నిర్వహిస్తాం..ప్రతీ నియోజకవర్గంలో బీసీచైతన్య యాత్రలు నిర్వహిస్తాం..ఏపీ ముఖ్యమంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలి..లేనిపక్షంలో పార్లమెంటు ముట్టడి చేస్తాం అని హెచ్చరించారు ఎంపీ ఆర్.కృష్ణయ్య.
Read Also: Jessica Jonassen: ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్ మహిళా క్రికెటర్.. ఫొటోలు వైరల్