NTV Telugu Site icon

MP Nandigam Suresh: అచ్చెన్న హత్యపై రాజకీయం తగదు.. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది..!

Mp Nandigam Suresh

Mp Nandigam Suresh

MP Nandigam Suresh: కడప జిల్లా బహుళార్ధ పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ చిన్న అచ్చెన్న అదృశ్యం.. ఆ తర్వాత మృతదేహం లభించడం కలకలం రేపుతోంది.. అయితే, దీనిపై తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం సరికాదని హితవుపలికారు ఎంపీ నందిగం సురేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డాక్టర్ అచ్చెన్న హత్య వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవగా తెలిపారు.. దీనిని రాజకీయం చేయటం కరెక్ట్ కాదన ఆయన.. లోతుగా విచారణ చేస్తున్నాం.. దోషులు ఎలాంటి వారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు.. టీడీపీ నాయకులు దళితులకు అన్యాయం జరిగిందని మాట్లాడటం హాస్యాస్పదమని కొట్టిపారేశారు.. ఎవరైనా దళాతుడిగా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు ఇప్పటి వరకు దళితులను క్షమాపణ చెప్పలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ నందిగం సురేష్‌.

Read Also: Gannavaram Airport: ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్‌ ప్రయాణికులు..!

కాగా, ఈ నెల 12వ తేదీన అదృశ్యమైన డాక్టర్ అచ్చెన్న 24వ తేదీన మృతదేహమై కనిపించాడు.. సహోద్యోగి ఆయనను హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. దీనికంతటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆఖిలపక్షపార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తూ ఆందోళనలకు దిగిన విషయం విదితమే.. మరోవైపు.. అచ్చెన్న హత్యకు దారితీసిన పరిస్థితులు తెలుసుకోవడానికి త్రిమెన్‌ కమిటీని నియమించింది ప్రభుత్వం… కమిటీ సభ్యులుగా డాక్టర్‌ సింహాచలం(అడిషనల్‌ డైరక్టర్‌, వైజాగ్‌), డాక్టర్‌ వెంకట్రావ్‌(ఆడిషనల్‌ డైరెక్టర్‌, చిత్తూరు), డాక్టర్‌ రత్నకుమారి(జేడీ, వెటర్నరీ బయోలాజికల్‌ రీసర్చ్‌ ఇనస్టిట్యూట్‌)ని నియమించారు.. డీడీ అచ్చెన్న అదృశ్యం, హత్య సంఘటనకు గల వివరాల సేకరణను ఇప్పటికే మొదలుపెట్టారు.