NTV Telugu Site icon

Margani Bharat: సీఎం జగన్ ను తలుచుకుంటేనే కొంతమందికి బిపి వస్తుంది..

Mp Margani Barath

Mp Margani Barath

రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించినట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. అయితే, సీఎం జగన్ ను తలుచుకుంటేనే కొంతమందికి బిపి వస్తుంది అని ఆయన అన్నారు. బీపీ అంటే బాబు.. పవన్ అని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ కు నిర్దిష్టమైన ఆలోచన లేదు.. రాష్ట్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో బాబు, పవన్ లు గాడిదలు కాశారా.. ఓటు హక్కు ఉందో లేదో తెలియని వారే పవన్ సభలకు వస్తున్నారు అని ఎంపీ కామెంట్స్ చేశారు.

Read Also: Crime News: కదులుతున్న రైలులో మైనర్‌ బాలికను వేధించిన నిందితుడు అరెస్ట్

పవన్ సభలకు వచ్చే అలరి మూకలను చూసి సాధారణ ప్రజల ఇబ్బంది పడుతున్నారు అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. దత్తపుత్రుణ్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. సీఎం జగన్ కేంద్రం నుంచి వంద శాతం నిధులు సాధిస్తున్నారు.. 2024 ఎన్నికల్లో దేవుడు కారుణించి కేంద్రంలో సీట్ల సంఖ్య వైసీపీకి అనుకూలంగా రావాలి అని మార్గాని భరత్ అన్నారు. కేంద్రంలో సీట్ల సంఖ్య మనకు అనుకూలంగా వస్తే ప్రత్యేక హోదా లభిస్తుంది అని పేర్కొన్నాడు.

Read Also: Prabhas: ఇది ‘ఆదిపురుష్’ అసలు లెక్క!

రాజమండ్రిలో జరుగుతున్న గ్రీనరీ అభివృద్ధికి ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సలేన్సీ అవార్డు వచ్చిందని ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. రాజమండ్రి యూత్ కి ఈ అవార్డ్ అంకితం చేస్తున్నాను.. రాజమండ్రిలో హరిత యువత పేరుతో కార్యక్రమం అమలు చేస్తున్నాను అని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 18 లక్షల చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ వెల్లడించారు.