NTV Telugu Site icon

GVL Narsimha Rao: తెలుగు రాష్ట్రాలపై ఇక ప్రత్యేక దృష్టి

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశాలకోసం మోడీ ,అమిత్ షా హైదరాబాద్ రానున్నారన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు..అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న బిజేపి ఎంపి జివి ఏల్ నరసింహారావు. నాలుగవ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మోడి పర్యటించి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపి ఏస్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందో మోడీ పర్యటనల వల్లే అర్దమౌతున్నాయన్నారు జీవీఎల్. తెలుగు రాష్ట్రాల పై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రతీ పోలింగ్ బూత్ లో బీజేపీ బలంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

అత్యంత వెనుక పడిన జిల్లాలుగా శ్రీకాకుళం , విజయనగరం ,విశాఖ ఉన్నాయి. ప్రకృతి వనరులు , నీటి వనరులు ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వెనుక బడిన ప్రాంతాలుగానే ఉండిపోయాయని విమర్శించారు జీవీఎల్. సరైన అభివృద్ధి లేకపోవడం వల్లే రైతులు , మత్స్యకారులు వలస పోతున్నారు. జల దీక్ష వంటి మా పోరాటం తరువాతనే ప్రభుత్వం వంశధారపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సహాయం అందేలా కృషి చేస్తాం అన్నారు.

అగ్నిపథ్ పథకం ప్రభుత్వ నిర్ణయం కాదు ..సైనిక దళాలే నిర్ణయం తీసుకున్నాయి. దేశ సైనిక బలంలో యువతరాన్ని నింపేలా అగ్నిపథ్ ద్వారా సాధ్యం అవుతుందన్నారు. అగ్నిపథ్ ద్వారా వేలాది మందిని రిక్యూట్ చేస్తుకుంటాం అన్నారు జీవీఎల్. ఈ పథకం కోసం భారీగా దరఖాస్తులు వస్తున్న సంగతి తెలిసిందే.

Naresh: పవిత్రా లోకేష్ కు, నాకు మధ్య ఉన్న సంబంధం అదే..!

Show comments