NTV Telugu Site icon

AP Crime: దృశ్యం సినిమా స్టోరీని మరిపించే ట్విస్ట్‌.. కొడుకును కొట్టి చంపిన తల్లి..!

Ap Crime

Ap Crime

AP Crime: ఓ హత్య కేసులో చుట్టూ తిరిగే దృశ్యం సినిమాలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చూపించారు దర్శకుడు.. ఈ తరహా ఘటనలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి.. తాజాగా, కృష్ణ జిల్లాలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును హత్య చేసింది ఓ కసాయి త్లి.. రోకలిబండతో కొట్టి కొడుకు దీప్‌చంద్‌ను హత్య చేసిన ఆమె.. ఎవరూ చంపేశారంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లారు.. తల్లి ప్రవర్తనలో తేడాను గుర్తించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది..

Read Also: Valentine’s Day: వాలెంటైన్స్ డేని “కౌ హగ్ డే”గా జరుపుకోండి

గన్నవరం ఏసీపీ విజయపాల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొడుకు చేసిన అప్పులు కట్టలేక ఈ దారుణానికి ఒడిగట్టింది దీప్ చంద్ తల్లి రమా.. అప్పులు చేయడమే కాదు.. తల్లిని డబ్బులు కావాలి ఇస్తావా? చస్తావని వేధించడంతో.. ఆ వేధింపులు తట్టుకోలేక.. కొడుకునే కాటికి పంపాలని ప్లాన్‌ చేసింది.. నిద్రపోతున్న కొడుకుని రోకలిబండతో కొట్టి చంపేసింది.. ఉదయం 5.30 గంటలకు మృతుడి తండ్రి లేచి పనికి వెళ్లిపోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికి నిద్రపోతున్న కొడుకుని రోకలిబండతో మోదీ చంపేసింది తల్లి.. అయితే, అనంతరం తలుపు వేసి తల్లి బయటికి వెళ్లి పశువుల దగ్గర పని చూసుకుంది.. ఉదయం 6:30 గంటలకు పాలు తీసుకుని తిరిగి ఇంటికి వచ్చింది.. ఆ తర్వాత తన భర్తకు ఫోన్ చేసి ఎవరో వచ్చి.. మన అబ్బాయిని కొట్టి వెళ్లిపోయారు.. రక్తం మడుగులో పడి ఉన్నాడు అని సమాచారం చేరవేసింది.. ఎవరో వచ్చి కొట్టి చంపినట్టు గ్రామస్తుల్ని, పోలీసుల్ని కూడా నమ్మించే ప్రయత్నం చేసింది.. ఇక, తన కూతురు కుమార్తెను తానే చూసుకుంటున్న నిందితురాలు.. ఆ పిల్లలు రెడీ చేసి స్కూల్‌కి పంపించేసింది.. కొడుకు చనిపోతే.. మనవరాలిని ఎలా స్కూల్‌కు పంపించింది..? అనే విషయంలో పోలీసులకు అనుమానం వచ్చింది.. దీంతో, ఆమెను తమదైన శైలిలో విచారించగా.. నేనే కొట్టి చంపానని అంగీకరించింది తల్లి.