NTV Telugu Site icon

Kadapa Crime: ఇంటర్ ఫెయిలైన కూతురు.. అవమానంతో తల్లి ఏం చేసిందంటే?

Mother Suicide

Mother Suicide

Mother Commits Suicide In Kadapa For Daughter Failing In Inter Exams: పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో లేక ఫలితాలు రాకముందే ఫెయిల్ అవుతామేమోనన్న భయంతోనో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అయితే.. కడపలో కూతురు ఫెయిలైందని, తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటు చేసుకుంది. కూతురు ఫెయిల్ అవ్వడాన్ని అవమానంగా భావించిన తల్లి.. రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కడపలోని ఏఎన్నార్ నగర్‌కు చెందిన గౌతమి.. ఇటీవల రాసిన ఇంటర్ పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన తండ్రి.. కోపంలో గౌతమిని మందలించాడు. ఎలా ఫెయిల్ అయ్యావని ప్రశ్నించాడు. కాలేజీకి వెళ్లి చదువుకోకుండా ఏం చేశావ్? అంటూ మండిపడ్డాడు.

Pakistan : సంసార సుఖం కోసం బల్లి నుంచి ఆయిల్.. ఎగబడి కొంటున్న జనం

దాంతో గౌతమి తీవ్ర మనస్తాపం చెందింది. తండ్రి మాటలను తట్టుకోలేకపోయింది. తన పరువు పోయేలా తండ్రి మాటలనడంతో.. గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అటు.. గౌతమి పరీక్షల్లో ఫెయిల్ కావడం, ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో.. తల్లి ఆదిలక్ష్మి అవమానంగా భావించింది. కూతురు ఎక్కడికి వెళ్లిందోనని దిగులు కూడా ఆమెని కలచివేసింది. ఈ బాధని దిగమింగుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా, చౌటపల్లె రైల్వేక్రాస్ వద్ద గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. బోరున విలపిస్తున్నారు. అటు.. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గౌతమి ఎక్కడికి వెళ్లిందన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.

Chennai Customs : దీని దుంప తెగ.. లగేజీ నిండా భయంకరమైన పాములు