NTV Telugu Site icon

Moshen Raju : మీ ఇష్టం వచ్చినట్లు సభ నడవాలంటే కుదరదు

Andhra Pradesh Legislative Council Chairman Moshen Raju Serious On TDP MLC’s.

ఏపీలో సంచలనం సృష్టించిన జంగారెడ్డిగూడెం మరణాలపై అసెంబ్లీ, మండలి సమావేశాల్లో రచ్చ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం జగన్‌ మండలికి వచ్చి స్టేట్‌మెంట్‌ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. అయితే జంగారెడ్డి గూడెం మరణాలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధగా ఉందని, మరణాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ప్రకటన చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే సీఎం జగన్‌ నిన్న ఇచ్చిన స్టేట్‌ మెంట్‌ తరువాత ఆరోగ్య శాఖ స్టేట్‌మెంట్ పనిచేయదని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.

దీంతో మండలి చైర్మన్‌ మోషన్‌ రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శాసనమండలి కొచ్చి స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్‌మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని, ముందు ప్రభుత్వం ఏం చెబుతుందో వినండని ఆయన అన్నారు. మంత్రి స్టేట్‌మెంట్‌ తర్వాత తెలుగుదేశం సభ్యులకు మాట్లాడడానికి అవకాశం ఇస్తామన్నారు. మంత్రి స్టేట్‌మెంట్‌ను తెలుగుదేశం సభ్యులు వినకపోతే ఎలా.. మీ ఇష్టం వచ్చినట్లు సభ నడవాలంటే కుదరదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Show comments