Site icon NTV Telugu

Krishna River : ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లేవి..?

Krishna River

Krishna River

ఈ ఏడాదిలో జూలై రెండో వారం వచ్చేస్తున్నా.. కృష్ణా నదిలో నీటి ప్రవాహం కనపించట్లేదు. కృష్ణ, ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో 85 టీఎంసీలకు పైగా ఖాళీ ఉండగా మిగితా జలాశయాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కిందటేడు జూన్ 10కే నదిలో ప్రవాహం మొదలు కాగా.. ఈ ఏడాది జులై 10 కి కూడా ప్రవాహం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో కృష్ణా పరీవాహక ప్రాంత రైతులు.. నాట్లు వేసేందుకు జంకుతున్నారు. ఏయే జలాశయాల్లో ఎంత నీటి మట్టం ఉందో.. గత ఏడాది ఈ టైం లో ఎంత వరకు నీరు ఉంది? ఎప్పటిలాగే నిండితే పంటలకు ఇబ్బంది ఉండదు.. అనేవి ఉండాలి.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ఏపీకి కొంత ఆలస్యమైంది.

CM Jagan : రేపు కడపకు సీఎం జగన్‌..

దీంతో ఏరువాకకు సిద్ధమయ్యే రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆలస్యంగా ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు మందకోడి విస్తరించడం కూడా మరికొంత రైతుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే రుతుపవనాలు విస్తరించి భారీ వర్షాలు కురుసి ఆయకట్టలు, చెరువులు, వాగులు వంకలు పొంగిపోర్లుతుండేవి. అయితే జూన్‌ మాసం ముగిసి.. జులై రెండు వారాలైన కృష్ణమ్మ పరవళ్లు తొక్కకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.

 

Exit mobile version