ఏపీలో ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబు స్వంత నియోజకవర్గం కుప్పంపై అధికార పార్టీ వైసీపీ ఫోకస్ పెట్టింది. తాజాగా నారా లోకేష్ కు కుప్పం వైసీపీ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ కౌంటర్ ఇచ్చారు. అవగాహన లేకుండా మొన్నటి రోజు నారా లోకేష్ మాట్లాడాడన్నారు భరత్. వైసీపీ నాయకులను లోకేష్ కుక్కలు అన్నాడు… మరోసారి అంటే మర్యాద ఉండదు….లోకేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు…సీఎం జగన్, పెద్దిరెడ్డి ల గురించి మాట్లాడే స్థాయి లోకేష్ కు లేదన్నారు భరత్.
Read Also: Chiranjeevi: కొరటాలపై చిరుకు ఇంత కోపం ఉందా..?
నోరు జారద్దు, జాగ్రత్త అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు భరత్. మేము ఇచ్చే షాక్ లకు తండ్రీకొడుకులకు ఇది వరకే మతిపోయింది. కుప్పంలో సభ్యత్వ నమోదు పేరిట ప్రజల డబ్బు దోచుకున్నారు.. ఆరోగ్య బీమా అన్నారు. ఎంత మందికి ఉచిత వైద్యం ఇచ్చారో చెప్పాలని భరత్ డిమాండ్ చేశారు. కుప్పంలో ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు రావాలి… కుప్పంలో ఉన్న మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు ప్రైవేట్ వారివి. హంద్రీ – నీవా, పాలారు ప్రాజెక్టులను చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదు….ప్రభుత్వ వైద్య కళాశాలను కుప్పం కు ఎందుకు మంజూరు చేయలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. మొన్న వర్షం వల్లే కుప్పంలో తాత్కాలిక అన్న క్యాంటీన్ కూలిందన్నారు.
Read Also: Students Gang War: మత్స్యపురిలో స్టూడెంట్స్ మధ్య గ్యాంగ్ వార్
