Site icon NTV Telugu

టీడీపీలాగా జన్మభూమి కమిటీలతో మాకు పనిలేదు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆసరా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. కృష్ణ జిల్లా గొల్లపూడిలో ఘనంగా ఆసరా వారోత్సవాలు చెప్పటింది ప్రభుత్వ యంత్రాంగం. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అయితే అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… గడచిన మూడున్నర దశాబ్ధాల్లో ఒక్క గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. పసుపు జెండాలుంటేనే పథకాలిచ్చారు. టీడీపీలాగా జన్మభూమి కమిటీలతో మాకు పనిలేదు అని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం. అర్హులైన పేదలందరికీ పట్టాలిచ్చాం. తలశిలరఘురాంతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం అని తెలిపారు.

Exit mobile version