ఏపీలో సంచలన సృష్టించిన 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా త్వరలోనే కొన్ని మార్పులతో మరోసారి బిల్లును తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇది ఇంటర్వెల్ మాత్రమే ఇంకా 3 రాజధానుల సినిమా అయిపోలేదు అన్నారు.
అయితే తాజాగా తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా 3 రాజధానుల అంశంపై స్పందించారు. సీఎం జగన్ తగ్గేదేలేదని.. ఆయన చెప్పారంటే చేస్తారంటే అంటూ వ్యాఖ్యానించింది. కొన్ని విషయాలను జతచేసి వచ్చే నెలలో లేదా రానున్న బడ్జెట్ సమావేశాల్లో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెడుతామని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా రైతులెవ్వరూ నిరసనలు చేయడం లేదని.. టీడీపీ బినామీలే రైతుల ముసుగులో నిరసనలంటూ.. రోడ్లపైకి వస్తున్నారన్నారు.