నిమ్మల రామానాయుడు.. ఏపీలో ఈయన పేరు తెలియనివారుండరు. తెలుగుదేశంపార్టీకి వున్న తక్కువ మంది ఎమ్మెల్యేల్లో నిత్యం యాక్టివ్ గా వుండే నిమ్మల రామానాయుడు. 2019లో వైసీపీ ప్రభంజనం ఉన్నా.. పాలకొల్లు నుంచి రెండవసారి తెలుగుదేశం జెండా ఎగరేశారు. నిత్యం ప్రజల్లోనే వుంటూ వారికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. తాజాగా దీపావళి పండుగ వేళ రామానాయుడు అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల మధ్య దీపావళి పండుగ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ కుటుంబం అంటే తన ఇంటిలోని నలుగురే కాదు, పగలనకా, రాత్రనకా కష్టపడి కట్టించిన 7వేల ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులన్నారు.నా అక్క , చెల్లెమ్మలందరూ నా కుటుంబంగానే భావించి దీపావళి పండుగ వారి మధ్య చేసుకోవడం సంతోషంగా వుందన్నారు. వారి ఇంట వండిన కమ్మనైన పిండి వంటలు నా తోబుట్టువులు మాదిరిగా రుచి చూపించడం నాకు చాలా మరపురాని అనుభూతిని కలిగించిందన్నారు. వారి పట్ల నా బాధ్యత మరింత పెంచింది. మిగిలిన 10 శాతం పనులు పూర్తిచేసి ఆఖరి ఇంటివారు గృహప్రవేశం చేసేంతవరకు శ్రమిస్తానన్నారు.
Read Also: Police Inspector Booked: కీచకుడైన రక్షకుడు.. మరదలిపై అత్యాచారం, 5సార్లు అబార్షన్
ఆ ఇళ్ళు ఉచితంగానే ఇచ్చేంతవరకు, రద్దు చేసిన ఇళ్ల నిర్మాణం జరిగేవరకూ పోరాటం కొనసాగిస్తానన్నారు. పట్టణ పరిధిలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు ప్రభుత్వం కళ్ళు తెరిపించేంతవరకు, నా ఆఖరి శ్వాస వరకు నా తోబుట్టువుల కోసం ఎంతకైనా పోరాడతా అని అన్నారు. రామానాయుడు చేసిన పని ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. కోవిడ్ టైంలోనూ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అందరికీ సాయం చేశారు. పగలనక, రాత్రనక సైకిల్ యాత్ర చేస్తూ ఆయన అందరి బాగోగులు పట్టించుకున్నారు. ప్రజా సమస్యలను కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. జగన్ పాలనపై ఆయన తనదైన రీతిలో నిరసన తెలుపుతూనే వున్నారు.
Read Also: Kantara: అసలు ‘కాంతార’ వివాదం ఏంటి.. దీనివలన ఎవరికి ఉపయోగం..?