MLA Jakkampudi Raja Strong Counters On Chandrababu Naidu: తన పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పర్యటనలో జెండాలు మాత్రమే ఫుల్లుగా ఉన్నాయని, ప్రజలు మాత్రం నిల్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వంటి దుర్మార్గుడు ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రోడ్డు షో ఫ్లాప్ అని తేల్చి చెప్పారు. చంద్రబాబు ప్రాంతాలు, కులాల మధ్య తగువు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి కారణం చంద్రబాబేనని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. జలయజ్ఞం ప్రాజెక్టులను ఆయన నిర్వీర్యం చేశారన్నారు.
YouTube: యూట్యూట్ లో తప్పుడు వార్తల ప్రసారం.. 8 ఛానళ్లపై కేంద్రం వేటు
వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే.. 2014 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుల కారణంగా.. హైకోర్టు ఆదేశాల మేరకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందన్నారు. రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను తాము ఎత్తివేశామన్నారు. చంద్రబాబు ఓ పనికిమాలిన మాజీ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. 300 ఎకరాల భూసేకరణకు సంబంధించి 90 మంది రైతులకు చంద్రబాబు నష్టపరిహారం ఇవ్వలేకపోయారన్నారు. 2వేల ఎకరాలు భూసేకరణ చేసి, తాము ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. 700 కోట్లు దోచేశానని టీడీపీకి సంబంధించిన పత్రికలో ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. తనకు రూ.70 కోట్లు ఇస్తే తన ఆస్తులన్నీ రాసి ఇచ్చేస్తానన్నారు.
Rahul Gandhi: అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగంపై నో క్లారిటీ